ఏమాయ చేసావే మూవీ తో అందర్నీ మాయ చేసిన సమంత..కెరియర్ మొదట్లోనే అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన జోడి కట్టి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. తెలుగు , తమిళ్ భాషల్లో వరుస మూవీస్ చేస్తూ కాల్ షీట్ ఖాళీ లేనంతగా బిజీ అయ్యింది. కెరియర్ జెట్ స్పీడ్ లో ఉన్న సమయంలో ప్రేమించిన తన మొదటి హీరోతో ఏడు అడుగులేసింది. అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకొని అక్కినేని ఫ్యామిలీ లో అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత అంత సినిమాలు చేయడం మానేస్తుందని అంత అనుకున్నారు కానీ సామ్ మాత్రం సినిమాలు చేయడం మానేయలేదు. గ్లామర్ పాత్రలకు కాస్త దూరంగా ఉంటూ విభిన్న కథలతో ఆకట్టుకుంటూ వస్తుంది.

ఓ పక్క సినిమాలు , మరోపక్క బిజినెస్ లు చేస్తున్న ఈమె.. ఆహా ఓటిటి లో హోస్ట్ గా మారింది. సామ్ జామ్ షో తో యాంకర్ గా మారింది. తారల టాప్ సీక్రెట్స్ ను సమంత తన చలాకీ యాంకరింగ్ తో అడిగి తెలుసుకుంది. చిరంజీవి , విజయ్ దేవరకొండ వంటి క్రేజీ స్టార్స్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  దీంతో ఈ షో అతి తక్కువ టైంలోనే బాగా క్రేజ్ తెచ్చుకుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ తో వచ్చిన సామ్ జామ్..మొదటి సీజన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది.  

మరో సీజన్ ఉంటుందో లేదో అని అంత అనుకుంటున్నా సమయంలో ఇప్పుడు సెకండ్ సీజన్ మొదలు కాబోతుందనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరి ఈ సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం హీరోయిన్ గా సమంత తమిళ్ లో మూవీ చేస్తుంది.           

మరింత సమాచారం తెలుసుకోండి: