అయితే సీనియర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలోనూ తెరకెక్కించారు. తెలుగు వెర్షన్ లో బాలకృష్ణ హరిశ్చంద్రుడు, దుశ్యంతుడు పాత్రల్లో నటించారు. హిందీలో కూడా బాలయ్య అవే క్యారెక్టర్లలో నటించారు. అయితే హిందీ వెర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో భరతుడి క్యారెక్టర్ వేశాడు తారక్. ఇదే జూనియర్ మొదటి సినిమాగా చెప్పుకోవచ్చు. అయితే మేజర్ చంద్రకాంత్’ సినిమా సమయంలో జూ. ఎన్టీఆర్ హిందీ చక్కగా మాట్లాడటం చూసి హిందీ వెర్షన్ లోకి తీసుకున్నారట.
కానీ ఈ సినిమా తెలుగులో దారుణ పరాజయం పాలైంది. దీంతో అప్పటికే షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ.. హిందీ వెర్షన్ విడుదల చేయకుండా ఆపారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆయన రాజకీయాలతో బిజీ అయ్యారు. అనంతర కాలంలో టీడీపీలో సంక్షోభం కూడా ఏర్పడింది. ఇలాంటి కారణాలతో ఈ సినిమా రిలీజ్ కాకుండానే అలా మిగిలిపోయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోని మొదటి సినిమా రిలీజ్ కాకుండా మిగిలిపోయింది. అది కూడా సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణతో కలిసి నటించిన సినిమా కావడం విశేషం. మూడు తరాల నందమూరి హీరోలు కలిసి నటించినప్పటికీ.. యాదృశ్చికంగా విడుదలకు నోచుకోలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి