భారీ అంచనాలతో విడుదలైన ‘చెక్’ మూవీ అంచనాలు అందుకోలేక పోయింది అన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు దాకా  చంద్ర శేఖర్ ఏలేటి తీసిన ప్రతి సినిమా ఒక కొత్త ప్రయత్నంగా విమర్శకుల నుండి ప్రశంసలు వస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు ‘చెక్’ మూవీ అటు సగటు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా విమర్శకులకు కూడ పూర్తిగా నచ్చకపోవడం షాకింగ్ న్యూస్ గా మారింది.  


చేయని నేరానికి ఉరిశిక్ష పడ్డ ఖైదీ తన తెలివితేటలతో ఎలా జైలు నుంచి బయటికి వచ్చాడనే పాయింట్ కు చెస్ గేమ్ నేపథ్యాన్ని ఎంచుకుని కొత్త తరహాలో ఈమూవీని తీయాలని ప్రయత్నించినా పూర్తిగా ఆ ప్రయత్నం సగటు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. మంచి సమర్థుడుగా పేరుగాంచిన చంద్ర శేఖర్ ఏలేటి ఈ మూవీ విషయంలో కొంత తడబాటు పడ్డాడు అన్న విమర్శలు వస్తున్నాయి.


దీనితో ఈ మూవీ ఓటమి నుంచి బయటపడి డ్రా చేసుకుంది మాత్రమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈమూవీ సక్సస్ అవ్వాలి అని ఆకాంక్షిస్తూ ఎన్టీఆర్ దగ్గర నుండి చాలామంది హీరోలు సెలెబ్రెటీలు నిన్న ఈ మూవీ విడుదల సందర్భంగా ఈ మూవీ యూనిట్ కు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు.


ఈ క్రమంలో నాని చేసిన చిన్న పొరపాటుకు బహిరంగ క్షమార్పణ చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ‘నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రాబోతోన్న చెక్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో నా స్నేహితులు నితిన్, రకుల్ ప్రీత్ లకు శుభాకాంక్షలు’ అని అభినందనలు తెలియచేసాడు. అయితే ఈమూవీ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్  మాలిక్ పేరు ప్రస్తావించడం మర్చిపోయాడు. అయితే ఆతరువాత తాను చేసిన పొరపాటును గుర్తించి తన తప్పును సరి చేసుకుని బహిరంగంగానే క్షమాపణలు చెప్పేశాడు.’సర్ క్షమించండి.. నాకెంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ మీరు పైగా నా మొదటి సినిమా ‘అష్టాచమ్మా’ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీరే.. నేను ఆ నిజాన్ని మరిచిపోయాను.. మీకు మళ్లీ ఓ హిట్ రావాలి.. బెస్ట్ విషెస్ అంటూ తన తప్పును సరిదిద్దుకున్నాడు. దీనితో నాని తన పొరపాటును గ్రహించినందుకు చాలామంది సోషల్ మీడియాలో నాని పై ప్రశంసలు కురిపించారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: