కింగ్ నాగార్జున హీరోగా సోలమాన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించారు. సినిమాలో నాగార్జున ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా నటించారు. సయామి ఫీమేల్ లీడ్ కాగా బిగ్ బాస్ ఆలి రెజా వంటి వారు నటించారు. సినిమా కథ గురించి రిలీజ్ డేట్ గురించి చిత్రయూనిట్ మండే ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టారు.

సినిమా ముందు నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయాలని అనుకున్నామని కాని థియేటర్లు ఓపెన్ అయ్యాక పరిస్థితి చూసి మళ్లీ ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి థియేటర్ రిలీజ్ చేస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు. హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ కు సంబందించిన కథతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. వైల్డ్ డాగ్ సినిమాపై నాగార్జున చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా థియేటర్ ఎక్స్ పీరియన్స్ చాలా బాగుంటుందని అన్నారు. ఇది ఓటిటి సినిమా కాదని ఇక మీదట ఇది థియేటర్ రిలీజ్ అవుతుందని అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ రవితేజ క్రాక్, వైష్ణవ్ తేజ్ ఉప్పెన సక్సెస్ ల గురించి మాట్లాడారు. ఆ రెండు సినిమాలు హిట్ అవడం తెలుగు పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నారు. నాగార్జున వైల్డ్ డాగ్ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని టాక్. మొత్తానికి నాగార్జున ప్లానింగ్ అదిరిందని చెప్పొచ్చు. ఈ సినిమాతో పాటుగా కొన్నాళ్లుగా చర్చల్లో ఉన్న బంగార్రాజు సినిమాని కూడా నాగార్జున సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: