బుల్లితెర మీద యాంకర్ గా తన టాలెంట్ చూపిస్తున్న శ్యామలా బిగ్ బాస్ సీజన్ 2లో అలరించింది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే శ్యామల తన మార్క్ యాంకరింగ్ తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను మెప్పిస్తుంది. ముఖ్యంగా టివి షోలతో పాటుగా అమ్మడు సినిమా ఈవెంట్స్ బాగా చేస్తుంది. దాదాపు స్టార్ సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ ఈవెంట్ ఏదైనా సుమ యాంకర్ గా ఉంటుంది. సుమ కాకపోతే మాత్రం ఆ ఛాన్స్ శ్యామలకి వస్తుంది.

శ్యామల కూడా తనకు వచ్చిన ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని తన సోషల్ మీడియాలో తన జిమ్ వర్క్ అవుట్ పిక్స్, వీడియోలను షేర్ చేస్తుంది. అమ్మడికి ఆల్రెడీ పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే సిల్వర్ స్క్రీన్ పై అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అయితే ఇప్పటివరకు ఆమెకు అలాంటి ఛాన్స్ రాలేదు. లేటెస్ట్ గా శ్యామలా తన పంథా మార్చినట్టు తెలుస్తుంది. తనలా పెళ్లై పిల్లలు ఉన్న కొంతమంది భామలు సిల్వర్ స్క్రీన్ పై వరుస అవకాశాలు తెచ్చుకుంటున్నారు. మరి అలాంటి టైం లో శ్యామలా కూడా అందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది.

తప్పకుండా శ్యామలా జిమ్ వర్క్ అవుట్స్ చూస్తుంటే సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ కోసమే అన్నట్టుగా ఉన్నా.. ఇన్నాళ్లు తనకు ఉన్న క్లాస్ ఇమేజ్ ను బ్రేక్ చేసి తను కూడా హాట్ షో చేయాలని ఫిక్స్ అయినట్టు ఉందని అంటున్నారు. శ్యామలా జిమ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కు.. అభిమానులకు ఈ వర్క్ అవుట్ పిక్స్ నచ్చేశాయి. మీరు కూడా సినిమాల్లో చేయొచ్చుగా అని ఆమెను అడిగేస్తున్నారు కూడా.. మరి శ్యామలా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: