తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల పాటలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కాని కొన్ని పాటలు మాత్రమే ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి.  అలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా కూడా ఎప్పుడూ కొత్త అనుభూతిని ఇస్తూ  ఉంటాయి అన్న విషయం తెలిసినదే. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులందరికీ ఎన్ని సార్లు విన్న కొత్త అనుభూతిని కలిగించే పాటల్లో ఒకటి కలర్ ఫోటో సినిమా లోని తరగతి గది దాటి అనే పాట.  కలర్ ఫోటో సినిమా ఎంత విజయం సాధించిందో ఈ సినిమాలోని తరగతి గది దాటి అనే పాట అంతకు మించిన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.



 ఇకపోతే తరగతిగది పాట ఇప్పటికి కూడా ప్రేక్షకుల నోళ్ళలో నానుతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కలర్ ఫోటో సినిమాలోని ఈ పాట కు ఎలాంటి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండదు అన్న విషయం తెలిసిందే. కానీ ఈ పాటకు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది అసలు ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంటుంది. కానీ ఇటీవల ఈ డాన్స్ చేసి అందర్నీ ఆకర్షించాడు ఇక్కడ ఒక డాన్సర్.  ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ప్రతి ఒక్క  బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నది  విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇటీవల స్కూల్ డేస్  ను గుర్తు చేసుకునే విధంగా సరికొత్త కాన్సెప్ట్  తెరమీదికి తెచ్చారు షో  నిర్వాహకులు.



 ఈ క్రమంలోనే ఇటీవలే ఢీ  షోలో భాగంగా ఒక కంటెస్టెంట్ తరగతి గది దాటి  అంటూ సాగిపోయే పాటపై డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు అతను డాన్స్  చేస్తున్నంత సేపు  ప్రోమో చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా కన్నార్పకుండా చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంత అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు అతను.  ఇక ప్రస్తుతం ఇటీవల  విడుదలైన ప్రోమో లో భాగంగా ఈపాట పై పర్ఫామెన్స్ చూసిన బుల్లితెర ప్రేక్షకులు ఇక ఈ పాట పై పూర్తి పర్ఫార్మెన్స్ చేసేందుకు ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: