తెలుగు సినిమా రంగంలో వాంప్ క్యారెక్టర్లకు చిరునామాగా జయలలిత హవా ఒక దశాబ్ద కాలం కొనసాగింది. బాబు మోహన్ జయలలితల కాంబినేషన్ లో అప్పట్లో చాల సినిమాలు వచ్చాయి. ‘లేడీస్ టైలర్’ మూవీలో ఆమె పోషించిన భాగ్యం క్యారెక్టర్ అప్పట్లో ఒక సంచలనం. అలాంటి జయలలిత తన ప్రాభవాన్ని కోల్పోయి ఇప్పుడు టీవీ సీరియల్స్ చేసుకుంటోంది.


మంచి క్లాసికల్ డాన్సర్ అయిన జయలలిత సాంప్రదాయ బద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. సాంప్రదాయాలకు విలువ ఇచ్చే దర్శకుడు విశ్వనాథ్ తన మేనల్లుడుకి జయలలితను ఇచ్చి పెళ్ళి చేయాలి అనుకుంటే అప్పట్లో అలా జరగలేదు అని అంటారు.


వాంపు క్యారెక్టర్లకు ఆమె పరిమితం కాక ముందు వాస్తవానికి ఆమె హీరోయిన్ గా రాణించాలని చాల ప్రయత్నాలు చేసింది. ‘ఖైదీ’ సినిమాలో సుమలత పోషించిన పాత్రకు ముందుగా జయలలితను ఎంపిక చేసి ఆతరువాత ఆమె స్థానంలో సుమలతను ఎంపిక చేసారు అంటే ఆమె దురదృష్టం ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది. అలాంటి జయలలిత ఆలీ నిర్వహిస్తున్న ఒక టాక్ షోకు అతిధిగా వచ్చి తనను ఒక వ్యక్తి 4 కోట్ల రూపాయలు మోసం చేసాడు అంటూ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. అప్పట్లో ఖరీదైన కార్లలో తిరిగిన జయలలిత ఒక ఫ్యామిలీతో ఉన్న పరిచయం కారణంగా గుడ్డిగా నమ్మేసి వాళ్లకి అప్పుగా 4 కోట్లు ఇచ్చిందట.


ఆతరువాత ఆఫ్యామిలీ తనను మోసం చేసి వెళ్లిపోయారు అది తెలుసుకుని వాళ్లు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని వెళ్లి ఎంతోకొంత ఇవ్వమని అడిగినప్పటికీ వారు తనను  పట్టించుకోలేదు అని చెపుతూ ప్రస్తుతం తాను సొంత కారు కూడ లేక క్యాబ్ లలో తిరుగుతు రోజువారీగా వచ్చే డబ్బుల కోసం సీరియల్స్ చేస్తున్నాను అంటూ ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. దీనితో జయలలిత కష్టాలను చూసి అలీ కూడ చలించిపోయాడు.   సినిమా తారల నవ్వుల వెనుక ఎన్నివ్యధలు ఉంటాయో అనడానికి జయలలిత జీవితం ఒక ఉదాహరణ..

మరింత సమాచారం తెలుసుకోండి: