బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లైగర్ అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం అందరికీ విదితమే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అటు విజయ్ దేవరకొండ ఇటు పూరి భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మాస్ హీరో, మాస్ డైరెక్టర్ కాంబినేషన్ పై ప్రేక్షకులు కూడా భారీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో బాలీవుడ్ దర్శకుడు కమ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా పాలు పంచుకుంటున్నారు. ఈ చిత్రంలో బాక్సర్ గా కనిపించనున్న హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కోచింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ చిత్ర షూటింగ్ వారం రోజులు నిర్విరామంగా కొనసాగించేందుకు ప్లాన్ చేశారట. అందుకోసం సెట్ కూడా సిద్దం చేశారట. ఈ సెట్ లో ఓ వారం రోజులు షూటింగ్ జరగనుంది. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ...ఇప్పుడు ఈ సినిమా కూడా అంతకు మించిన విజయాన్ని అందిస్తుందని ఆకాంక్షిస్తున్నాడు. మరి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రావాలని ఆశిద్దాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి