బ్రూస్ లీ’ సినిమా విడుదల తేది దగ్గరపడుతున్న కొద్ది రామ్ చరణ్ వెంటాడుతున్న ఇంటి సమస్యలు పెరిగిపోతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ తనయుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్ కు తన మెగా కుటుంబానికి చెందిన మెగా యంగ్ హీరోల పోటీ చరణ్ ను షేక్ చేస్తోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

దీనికి కారణం ఈ వారం విడుదలైన సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాకు రివ్యూలు ఎలా వచ్చినా వాటితో సంబంధం లేకుండా ఈరోజుతో ముగిసి పోతున్న వారాంతానికి ప్రపంచ వ్యాప్తంగా 10 నుంచి 12 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయబోతోంది అని టాలీవుడ్ మార్కెట్ విశ్లేషకులు బయట పెడుతున్న విశ్లేషణలు చరణ్ ను ఖంగారు పెడుతున్నాయి అని అంటున్నారు. 

చిన్న బడ్జెట్ తో తీసిన ఆ సినిమాకు ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తే దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో తీసిన తన ‘బ్రూస్ లీ’ కి ఏ రేంజ్ లో కలెక్షన్స్ రావాలి అని లెక్కలు వేసుకుంటూ టెన్షన్ లో ఉన్నాడట చరణ్.  దీనితో ‘బ్రూస్ లీ’ ప్రమోషన్ చాల భారీ స్థాయిలో చేయాలని చరణ్ ఆలోచిస్తున్నట్లు టాక్. దీనితో ఈసినిమా ఆడియో ఫంక్షన్ ఏర్పాట్ల పై చరణ్ తన దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది. 

వినపడుతున్న వార్తల ప్రకారం అక్టోబర్ 2న ‘బ్రూస్ లీ’ ఆడియో ఫంక్షన్ డిఫరెంట్ గా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా ‘బ్రూస్ లీ’ విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమాలోని మిగిలిన తన పాత్ర షూటింగ్ కోసం చరణ్ ఒకేరోజు 17 గంటలు షూటింగ్ స్పాట్ లో కష్టపడ్డాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఏమైనా ఇంటి టెన్షన్ రామ్ చరణ్ చేత స్పీడ్ గా పరుగులు పెట్టిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: