ఈ విషయమై స్టార్ నటి శృతి హాసన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, మీరు ఒకవేళ పక్కా మాస్ మూవీ చేస్తే కోట్లరూపాయల కలెక్షన్ వస్తుంది కదా, మరి ఎందుకు చేయడం లేదు అని తాను మహేష్ ని అడుగగా, రొటీన్ కంటే కొంత బిన్నంగా ముందుకు సాగడమే తనకు ఇష్టం అని, కొంత కమర్షియల్ గా అలానే కొంత డిఫరెంట్ జానర్ ఉండేలా సినిమాలు ప్లాన్ చేస్తుండడం తనకు ఇష్టం అని మహేష్ చెప్పారని, దానిని బట్టి ఆయనకు సినిమా అంటే ఎంత ఫ్యాషనో అర్ధం చేసుకోవచ్చని అన్నారు శృతి. ఇక మహేష్ ని బాలీవుడ్ తెరపై చూడాలనేది ఆయన ఫ్యాన్స్ తో పాటు ఎందరో ప్రేక్షకుల కల. అందుతున్న సమాచారాన్ని బట్టి అది త్వరలో తీరే ఛాన్స్ కనబడుతోందని అంటున్నారు.
త్వరలో రాజమౌళి తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్న సూపర్ స్టార్, అది ముగిసిన అనంతరం ఒక బడా బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నారు అనేది బి టౌన్ టాక్. అయితే అదే కనుక జరిగితే, సూపర్ స్టార్ సై అంటే తాను కూడా ఆయనతో ఒక భారీ మూవీ తీయడానికి సంసిద్ధం అంటూ బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకనిర్మాత కరణ్ జోహార్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరి ప్రచారం అవుతున్న ఈ వార్తలు కనుక నిజం అయితే, సూపర్ స్టార్ క్రేజ్, పాపులారిటీ రాబోయే రోజుల్లో మరింత గొప్పగా పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి