హీరో రామ్ నటించిన రెడ్ సినిమాలో హెబ్బా పటేల్ తో ఒక ఐటమ్ సాంగ్ చేయించారు. నిజానికి ఈ పాటను కావాలనే సినిమా మధ్యలో బలవంతంగా చొప్పించినట్లు అనిపించింది కానీ దీనివల్ల సినిమాకి పెద్దగా ప్రయోజనం ఏమి కలగలేదు. సినిమా స్క్రిప్ట్ కి అస్సలు సూట్ కాదు అనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. క్రాక్ సినిమాలో వల్గారిటీ గా ఉన్న 'భూమ్ బద్దల్' ఐటమ్ సాంగ్ లేకపోయినా.. అదే స్థాయిలో మూవీ హిట్ అయ్యేది. అల్లుడు సినిమాలో మోనాల్ గజ్జర్ సాంగ్, పైన పటారం లోన లొటారం అంటూ చావు కబురు చల్లగా సినిమాలో అసభ్యకరమైన ఐటమ్ నెంబర్ కి బదులుగా మంచి మెలోడీ పాటలు చేసినట్లైతే ఇంకా బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అప్సర రాణి, రెజీనా కసాండ్రా వంటి నటీమణులు తమ అందాలను ఎరగా వేస్తూ జోరుగా సెక్సీ సాంగ్స్ చేస్తున్నారు. హాట్ ముద్దుగుమ్మలు సెక్సీ డాన్స్ లు వేస్తేనే తమ సినిమాలు హిట్ అవుతాయని చాలామంది దర్శక నిర్మాతలు భావిస్తున్నారు కానీ నాంది, జాతి రత్నాలు, ఉప్పెన వంటి సినిమాలు ఎటువంటి ఐటమ్ సాంగ్స్ లేకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. స్పెషల్ సాంగ్స్ అంటూ నిర్మాతలు యదేచ్ఛగా ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు కానీ ఈ విషయంపై చర్చ చేయగలరా అంటే లేదనే చెప్పాలి. మరి స్టార్ హీరోలైనా ఐటమ్ సాంగ్స్ పై హీరోలు ఓ నిర్ణయం తీసుకుంటారా? అనేది ప్రశ్నార్థకమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి