కిరిక్ పార్టీతో కన్నడలో హీరోయిన్ గా అడుగు పెట్టిన రష్మిక, తొలి సినిమాతోటే ప్రేమలో పడిపోయారు. రక్షిత్ షెట్టితో ఆమె ప్రేమ వ్యవహారం ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లింది. ఆతర్వాత పెళ్లికి ముందే ఆ లవ్ స్టోరీ క్యాన్సిల్ అయింది. అప్పటినుంచీ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన రష్మిక తెలుగులో వరుస హిట్లు కొట్టింది. ఛలోతో మొదలైన ఆ హిట్ ట్రాక్ గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ.. ఇలా కంటిన్యూ అవుతోంది. విజయ్ దేవరకొండతో రెండోసారి చేసిన డియర్ కామ్రేడ్ ఒక్కటే కాస్త నిరాశ పరిచే మూవీ.
ప్రస్తుతం కన్నడ, తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న రష్మిక.. ఇటీవలే తమిళ్ లో సుల్తాన్ మూవీ చేసింది. కార్తీ హీరోగా నటించిన ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలో.. రష్మిక కనిపించే సన్నివేశాలు మాత్రం సరదాగా సాగిపోతాయి. ఒకరకంగా రష్మికకు మంచి పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్ర ఇది. అందులోనూ కార్తికి జంటగా తమిళనాట అడుగుపెడుతోంది కాబట్టి, అక్కడ భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో సూర్య సినిమాని కాల్షీట్ల సమస్యతో వదిలేసుకున్న రష్మిక, ఇప్పుడు ఆయన తమ్ముడు కార్తి మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఇక తమిళనాట కూడా రష్మిక హవా మొదలైనట్టే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి