కేరళ కుట్టి పూర్ణ సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వం వహించిన అవును చిత్రం లో సెట్ చేసి ప్రేక్షకుల మతులు పోగొట్టారు. లడ్డు బాబు, నువ్విలా నేనిలా, అవును 2 చిత్రాలలో మంచి నటనా చాతుర్యం కనబరిచి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ఇప్పుడు చాలా సినిమాతో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో బాగా స్కిన్ షో చేస్తున్నారు.


బ్యాక్ డోర్ చిత్రం లో ఆమె హీరోయిన్ గా చేస్తున్నారు. ఆ సినిమాలో ఆమె అడల్ట్ సీన్స్ లో నటించారు. ఇప్పటివరకు ఫ్యాన్స్ ఆమెను అలాంటి సన్నివేశాల్లో చూడలేదు. కానీ ఇప్పుడు ఆమె అన్ని హద్దులు దాటుతూ బోల్డ్ సీన్స్ లో నటిస్తూ షాక్ ఇస్తున్నారు. రొమాంటిక్ డ్రామా అయిన "సుందరి" లో కూడా ఆమె హాట్ సీన్స్ లో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రయిలర్ విడుదల కాగా.. అది కూడా అడల్ట్ మూవీ కోవలోకే వస్తుందని అర్థమవుతుంది.


పూర్ణ సడన్ గా అడల్ట్ సినిమాల్లో నటించడం ప్రారంభించడం తో ఆమె అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోల సరసన నటించిన ఈమె బుల్లితెర యాంకర్ ప్రదీప్ తో కూడా లవ్ ట్రాక్ నడిపించడం చూస్తుంటే.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే విధానాన్ని ఆమె పాటిస్తున్నట్టు అర్థమవుతోంది.


ఇదిలా ఉండగా ఆమె జయలలిత బయోపిక్ అయిన తలైవి చిత్రంలో శశికళ పాత్ర పోషిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా మూవీలో ఒక కీలకమైన రోల్ లో ఆమె కనిపించనున్నారు. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం ప్రేమ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఒకరేండ్రు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పవర్ ప్లే చిత్రం లో పూర్ణ ఒక సీఎం కూతురు పాత్రలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులను బాగా అలరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: