నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో "సింహ","లెజెండ్ " వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత మరో సారి మూడవ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేసేసారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికీ ఇంకా నలభై శాతం షూటింగ్ మిగిలి ఉందని సమాచారం. ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా.. షూటింగ్ జరిపితే.. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతుండడం, మళ్లీ లాక్ డౌన్ భయాల మధ్య సినిమా ఇండస్ట్రీలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది.ఎప్పుడు ఎలాంటి అడ్డంకులు వస్తాయో చెప్పలేని పరిస్థితి ఇప్పుడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ఉండదని గట్టిగా చెబుతున్నప్పటికీ ఎవరి భయాలు వారికున్నాయి.ఈ క్రమంలో సినిమాను అనుకున్న సమయానికి సిద్ధం చేయగలనా..? లేదా..? అనే సందేహాలు బోయపాటికి కలుగుతున్నాయట.


వీలైనంత వరకు మూడు షిఫ్ట్ లలో పని చేసి సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.ఇక టైటిల్ విషయానికి వస్తే 'మోనార్క్' అనే టైటిల్ వినిపిస్తున్నప్పటికీ.. బాలయ్య వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బోయపాటి కూడా కొత్త టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు. ఓ సంస్కృత పదాన్ని టైటిల్ గా పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. సినిమాలో బాలయ్య రెండో క్యారెక్టర్ కి ఒంటి నిండా టాటూలు ఉంటాయట. ఆ టాటూలు అన్నీ కూడా సంస్కృతం పదాలే అని తెలుస్తోంది. దానికి తగ్గట్లే టైటిల్ కూడా సంస్కృత పదమే ఉండేలా పేర్లు వెతుకుతున్నారు.ఇక విడుదల విషయంలో బాలయ్య అభిమానులు లేట్ అవుతుందేమోనని కంగారు పడుతున్నారట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: