యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూట్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్, ఆలియా భట్ లపై సినిమాలోని ఒక కీలకమైన సాంగ్ ని యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధిక వ్యయంతో భారీ స్థాయి సాంకేతిక విలువలతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దానయ్య దాదాపు రూ. 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. ఆలియా భట్ తో పాటు ఒలీవియా మోరిస్ మరో హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియ, అజయ్ దేవగన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అలానే పలువురు హాలీవుడ్ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా విజయేంద్రప్రసాద్ కథని సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా దర్శకుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ భారీ కమర్షియల్ సక్సెస్ అందుకని గత రికార్డులను తిరగరాయడం ఖాయమని పలువురు ప్రేక్షకులు అభిమానులు అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు తమ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఇస్తున్న ఆర్ఆర్ఆర్ యూనిట్ నేడు కొద్దిసేపటి క్రితం పెట్టిన ఒక పోస్టు సోషల్ మీడియాలో మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది.

హెచ్చరిక ఆయన నిప్పులా రగులుతున్నాడు దయచేసి ఎప్పటికప్పుడు అందరూ వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ఆర్ఆర్ఆర్ యూనిట్, ప్రస్తుతం మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని పెట్టిన ఈ పోస్ట్ పై పలువురు అభిమానులు, ఈ విధంగా వెరైటీ గా కూడా ప్రమోషన్ చేస్తారా అంటూ ఒకింత సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: