అందుకోసం చాలా కాలంగా కథలు వింటూ వస్తున్నారు. ఆ మధ్యన ఒక కథను విన్నారట.వేణు మల్లిడి అనే కొత్త డైరక్టర్ చెప్పిన కథ ఇలాంటి పాయింట్ చుట్టూనే తిరుగుతుందిట. ఆ కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చింది. ఈ సినిమా టైమ్ మిషన్ నేపథ్యంలో ఉండటంతో కొద్ది పాటి మార్పులు చేర్పులు చేసి వెంటనే ఓకే చేసాడట. ఇప్పుడున్న పరిస్దితులు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమా చేస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
ఆ కథ ప్రకారం ప్రస్తుతం కాలానికి 500 సంవత్సరాలు వెనక్కి వెళతారని తెలుస్తుంది. అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించడానికి భారీ సెట్స్ కూడా వేయాలని ఫిక్స్ అయ్యి..డిజైన్స్ రెడీ చేయిస్తున్నారట. సినిమా కథ ప్రకారం గత కాలానికి వెళ్లి అక్కడో సమస్యలో పడి, దాన్ని పరిష్కరించుకుని బయిటపడటమే అంటున్నారు.అయితే టైమ్ మిషన్ కాన్సెప్టు ని మాత్రం యాజటీజ్ వాడటరట. ఇప్పటిదాకా వరుస ప్లాఫ్ సినిమాలతో డీలా పడిన కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా ఒక కీలకం అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి