సాధారణంగా వేసవికాలంలో
చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఎండాకాలంలో భారీ సినిమాలతో చిన్న సినిమాలు కూడా పోటీ పడుతుంటాయి. అయితే వేసవిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద
బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే సినిమాలో మంచి కంటెంట్ ఉండాలి. మంచి కంటెంట్ లేకపోతే ఇతర సినిమాల సునామీలో కొట్టుకుపోవడం ఖాయం. అయితే ఈ ఏడాది వేసవి రిలీజ్ కి చాలా సినిమాలు క్యూ కడుతున్నాయి. టక్
జగదీష్, విరాట పర్వం, ఆచార్య,
నారప్పవంటి స్టార్ హీరోల సినిమాలు వేసవికాలంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంత ఈసారి సినిమాల మధ్య భారీ పోటీ నెలకొనబోతుందని అర్థమవుతోంది.
అయితే
రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ
సినిమా మే 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
బోయపాటి శ్రీను
బాలకృష్ణ కాంబినేషన్ వస్తున్న బీబీ3(గాడ్ ఫాథర్)
సినిమా కూడా మే 28 వ తేదీన విడుదల కానుంది. ఈ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బోయపాటి,
బాలకృష్ణ కాంబోలో వస్తున్న
సినిమా పై భారీ అంచనాలున్నాయి.
బోయపాటి మార్కుతో
బాలయ్య మాస్ యాక్షన్ తో వస్తున్న ఈ
సినిమా ఇతర స్టార్ హీరోల సినిమాలకు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే ఇటీవల విడుదలైన ఖిలాడీ
సినిమా పోస్టర్ చూస్తుంటే..
రవితేజ ప్రేక్షకులని ఫుల్ గా ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నారని తెలుస్తోంది. ఈ
సినిమా కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఉగాది
పండుగ సందర్భంగా ఉదయం పూట 10:08 సమయంలో విడుదల కానున్నది. కానీ
బాలకృష్ణ సినిమాకు సంబంధించిన టైటిల్ గానీ, ఫస్ట్ టీజర్ లాంచ్ డేట్ కానీ ఇప్పటివరకు ప్రకటించలేదు. దీనితో
సినిమా ప్రమోషన్ విషయంలో
బాలకృష్ణ కంటే రవితేజనే ముందున్నారని చెప్పుకోవచ్చు.