దీనితో అనేక ఆలోచనలు చేసి ‘ఆదిపురుష్’ దర్శక నిర్మాతలు శ్రీరామనవమి రోజున విడుదల చేయబోయే ఫస్ట్ లుక్ విషయమై ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు 500 కోట్ల బడ్జెట్ తో తీయబోతున్న ఈమూవీ ఫస్ట్ లుక్ పోష్టర్ విడుదల చేయగానే దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడానికి ఈమూవీ దర్శకుడు ఓం రౌత్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రీరామ నవమి రోజునే శ్రీరాముడి పట్టాభిషేకం కూడ జరిగింది కాబట్టి ఆరోజు శ్రీరాముడి పాత్రలో కనిపించే ప్రభాస్ సీత పాత్రలో కనిపించే కృతి సనన్ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు సింహాసనం పై కూర్చుని ఉండే స్టిల్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించు కున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆరోజు ఎక్కడ చూసినా ఆ స్టిల్ కనపడుతూ వైరల్ గా మారుతుంది. శ్రీరామ నవమి రోజు మొత్తం ఆ పిక్ వైరల్ అవుతుంది.
ఈ సినిమాను ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్ గా చేయడానికి చాలగట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు గ్రాఫిక్స్ సంబంధించి పనులు చేస్తూనే మరోవైపు రియల్ క్యారెక్టర్స్ షూటింగ్ చేస్తూ ఈమూవీని అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమూవీలోని శ్రీరాముడి పాత్రకోసం ప్రభాస్ తన బాడీ లుక్ లో చాల మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ మలయాళ కన్నడ భాషలలో కూడ ఈమూవీని రిలీజ్ చేసి ప్రభాస్ స్టామినాను మరొకసారి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి