ఇప్పుడు వరకు గౌతమ్ మీనన్ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక గౌతం మీనన్ సినిమా వస్తుందంటే చాలు అటు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగి పోతూ ఉంటాయి. అయితే సినిమాల్లో తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించే గౌతమ్ మీనన్ ఇక కేవలం స్టార్ డైరెక్టర్ గా మాత్రమే సరిపెట్టుకోకుండా తనలోని నటుణ్ణి కూడా నిరూపించుకోవాలి అనుకున్నాడో ఏమో పలు కీలక పాత్రలో నటించడం కూడా మొదలు పెట్టాడు. గత ఏడాది తమిళంలో వచ్చిన ఆంథాలజీ సిరీస్ లో నటించి మెప్పించాడు స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్
అంతేకాదు పలు సినిమాలలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా నటించి ఎంతగానో ప్రేక్షకులను అలరించాడు. చాలా రోజుల తర్వాత గౌతమ్ మీనన్ మరో సారి అభిమానులను అలరించేందుకు మళ్ళీ పోలీస్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. వెట్రిమారన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో గౌతమ్ మీనన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతుండగా.. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సూరి లీడ్ రోల్ చేస్తున్నారట.. ఈ క్రమంలోనే సినిమాల్లో ఒక పవర్ ప్యాక్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గౌతం మీనన్ కనిపించబోతున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. దీంతో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ స్టార్ డైరెక్టర్ ను చూసేందుకు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి