ఈ ఏడాదిలో విడుదలైన జాతిరత్నాలు, ఉప్పెన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో నటించిన యంగ్ హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, కృతి శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. చిట్టి నీ నవ్వంటే పాట ఫరియా అబ్దుల్లా క్రేజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న పిల్లలు కూడా చిట్టి పాట ను జాతీయ గీతంగా ఆలపిస్తున్నారు. జాతి రత్నాలు సినిమాలో ఆమె నవీన్ పోలిశెట్టి తో పండించిన కెమిస్ట్రీ కూడా చూడ చక్కగా ఉంది. ఆమె నవ్వు యువకుల మనసులను దోచేసిందని చెప్పవచ్చు.



మరోవైపు కృతి శెట్టి కూడా బేబమ్మ పాత్రలో బ్రహ్మాండంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను అమాంతం హత్తుకున్నారు. అయితే వీరిద్దరి లో కృతి శెట్టి ఉప్పెన క్రేజ్ తో అనేక సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు కానీ ఫరియా ని మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా ఆఫర్ కూడా వరించలేదు. దీనికి కారణం ఆమె ఎత్తే అని తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఆమె హైట్ చూసి అప్పట్లో అవాక్కయ్యారు. దాదాపు ఆరడుగుల హైట్ ఉన్న ఫరియా పక్కన రానా దగ్గుబాటి, ప్రభాస్, మహేష్ బాబు, గోపీచంద్, మంచు విష్ణు, వరుణ్ తేజ్, అల్లరి నరేష్ లాంటి ఆరడుగుల ఆజానుబాహులు మాత్రమే కరెక్ట్ గా సూట్ అవుతారు.



ఇక ప్రస్తుత యంగ్ హీరోలందరూ కూడా 6 అడుగులకు తక్కువగానే ఉన్నారు. రాజు తరుణ్, సాయి ధరమ్ తేజ్, రామ్, నాగ శౌర్య, నాని, నిఖిల్ వంటి చాలా మంది టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ ఫరియా కంటే ఎత్తు తక్కువగానే ఉన్నారు. దీనివల్ల ఆమెకు హీరోయిన్ రోల్ ఇచ్చే వారే కరువయ్యారు. నిజానికి అయిదడుగుల అయిదు అంగుళాల ఉండే పూజ హెగ్డే చాలామంది టాలీవుడ్ హీరోల హైట్ కి సమానంగా కనిపిస్తుంటారు. ఈ విధంగా చూసుకుంటే ఫరియా ఏ హీరోకి కూడా సెట్ కాదని తెలుస్తోంది.



మరోవైపు కృతి శెట్టి యావరేజ్ హైట్ తో అందరి హీరోల సరసన పర్ఫెక్ట్ గా కనిపించేలా ఉన్నారు. అందుకే ఆమెను తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక అవకాశాలు వరిస్తున్నాయి. దీన్నిబట్టి తక్కువ హైట్ కారణంగా కృతికి ప్లస్ అయితే.. ఎక్కువ హైటు ఉండటం ఫరియాకి మైనస్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: