తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు చిరంజీవి. ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా ఏ మాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు
మెగాస్టార్ స్థాయిలో నిలబడ్డారు. ఆయన జీవితంలో ఏదైనా మరక అంటింది అంటే అది రాజకీయాల్లోకి రావడం ఆ తదనంతర కాలంలో పార్టీని
కాంగ్రెస్లో విలీనం చేయడం అని చెప్పక తప్పదు. సినిమాల విషయంలో ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎందరో హీరోలుగా, దర్శకులుగా, టెక్నీషియన్లుగా పరిశ్రమకు వచ్చి రాణిస్తున్నారు.
చిరంజీవి కూడా తనకు రాజకీయాలు వర్కవుట్ కాదని అర్థమై తనను ఇంతవాడిని చేసిన సినీ గూటికి చేరారు.
ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఆ తర్వాత చేసిన
సైరా సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. ఇక చిరు ఆస్తి విషయానికి వస్తే, చిరు ప్రతిపైసా కూడ బెట్టి సంపాదించారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, స్వయం కృషితో ఎదిగి, కోట్లాది అభిమానుల గుండెల్లో
మెగాస్టార్ గా సుస్థిర స్థానం సంపాదించుకున్న చిరంజీవికి ప్రస్తుత రెమ్యునరేషన్ 20 కోట్ల పైమాటే.
చిరంజీవి చేసిన చిత్రాలు 150 వరకూ ఉన్నాయి.
దీంతో ఆయన ఆస్తులు వందల కోట్లు దాటేసి వుంటాయని కూడా అందరూ భావిస్తారు. కానీ చివరిగా ఎన్నికల్లో పోటీచేసిన సమయంలో తన పేరిట 33 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో చూపించారు. అందులో 30 కోట్లు స్థిరాస్తులు కాగా, 3 కోట్లు చరాస్తులు గా పేర్కొన్నారు. ఇక అప్పుల విలువ 59 లక్షలనీ పేర్కొన్నారు. అలాగే ఆయన భార్యకు 6 కోట్ల ఆస్తి ఉన్నట్లు చూపించారు. ఆయితే చిరు వేలకోట్లకు పడగెలెత్తాడని ప్రచారం అయితే ఉంది. మరి ఇందులో నిజానిజాలు ఏమిటి అనేది ఆయనకే తెలియాలి.