శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఫిదా. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి, మొదటి సినిమా తోనే మంచి హిట్ ను అందుకుంది. ఆ తర్వాత కణం, ఎమ్.సీ.ఏ, మారి 2 , పడి పడి లేచే మనసు, రీసెంట్ గా లవ్ స్టోరీ వంటి సినిమాలలో నటించింది. తన నటనతో పాటు, డాన్స్ తో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాను నటించబోయే సినిమాలలో ముఖ్యం గా కథకు ప్రాధాన్యత  ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటుంది.


సాధారణంగా సినీ ఇండస్ట్రీ చాలా మంది  హీరోయిన్లు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఆలోచనలో ఉంటారు. కానీ సాయి పల్లవి అలా కాదు . తనకి మంచి పేరు తెచ్చి పెట్టే పాత్రలకు మాత్రమే  ఓకె చెప్తుందట.. లేదంటే నేను ఎలాగో చదువుకున్నాను కాబట్టి ఏదైనా జాబ్ చేసుకుంటానంటూ చెప్పుకు వచ్చింది సాయి పల్లవి. ఇక అసలు విషయంలోకి వస్తే... గడిచిన మూడు సంవత్సరాల్లో ఈమె ఏకంగా రూ.5 కోట్లు వదులుకున్నది. అది ఎలా అంటే?..


సాయి పల్లవి ప్రస్తుతం సినిమాకి రూ.80 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు తీసుకుంటుంది. అయితే ఈమె మూడేళ్లలో డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, అయ్యప్పనుమ్ కొషియమ్ ( రీమేక్ ). బెల్లంకొండ శ్రీనివాస్ తో కాదన్( రీమేక్ ) వంటి సినిమాలలో నటించడానికి అవకాశం వచ్చిందట. అంతేకాకుండా ఇవన్నీ కూడా స్టార్ సినిమాలు కాబట్టి ఆమెకు రూ.కోటి పైన పారితోషకం ఇస్తామని నిర్మాతలు ఆఫర్ ఇచ్చారట. కానీ ఈ హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని భావించి ఆమె రిజెక్ట్ చేసింది.

దీనికీ తోడు సాయి పల్లవి కి 5 నుంచి 6 యాడ్స్ వంటివి వాటిలో యాక్ట్ చేసే ఆఫర్లు వచ్చినా  వాటిని కూడా రిజెక్ట్ చేసిందట. అయితే వీటితో మొత్తం కలిపి  చూస్తే రూ.5 కోట్ల పైనే ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: