ఈరోజు
జూనియర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు సందర్భంగా సోషల్
మీడియా మాధ్యమాలు లక్షల కొద్దీ జన్మదిన శుభాకాంక్షలతో నిండిపోతున్నాయి. మొదట్లో బొద్దుగా ఉన్న
జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా సన్నగా అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. యమదొంగ వంటి చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.
తారక్ చిన్నతనంలోనే భరతనాట్యం లో శిక్షణ తీసుకున్నారు. నృత్యకళలో శిక్షణ పొందిన ఆయన ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బహుమతులు గెలుచుకున్నారు. చిన్నతనంలోనే ఎంతో కృషి పట్టుదలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు దక్కించుకున్నారు.
తారక్ సినిమాల్లో రంగప్రవేశం చేసిన తర్వాత కూడా కేవలం తన నటనా ప్రతిభ తోనే స్టార్
హీరో స్థాయికి ఎదిగారు. అత్యంత శక్తివంతమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆయనకు
నందమూరి హీరోల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. కానీ ఆయన తన స్వశక్తిని నమ్ముకుని
సినిమా రంగంలో గొప్ప నటుడిగా పేరు పొందారు. కాగా ప్రస్తుతం అభిమానులు సోషల్
మీడియా వేదికగా
జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనాన్ని పొగుడుతూ జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
నందమూరి వంశం లో కల్యాణ్
రామ్, తారకరత్న సినీ రంగ ప్రవేశం చేసినట్టు
తారక్ నందమూరి వంశం లో ఒక్కడిగా వచ్చి నిలబడలేదు. ఆయన ఒక్కడిగా వచ్చి వంశాన్నే నిలబెట్టారు.
నందమూరి తారక రామారావు .....
చరిత్ర సృష్టించడానికే పుట్టారు. ఆయన ఓ భవిష్యత్ రాజకీయవేత్త. ప్రజలను పాలించడానికే జన్మించారు అని అభిమానులు తమ ఫేవరేట్
హీరో గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.