తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళ లాంటి వారు అయిన ఎన్టీఆర్ ఏఎన్నార్ లతో  రామ్ గోపాల్ వర్మ ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుండగా రామ్ గోపాల్ వర్మ అభిమానులు ఈ ఫోటోని కూడా వైరల్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి అంతా నా ఇష్టం అంటూ ఎవరి మాటలను లెక్క చేయకుండా ఇష్టం వచ్చిన సినిమాలు చేసి ఉన్న పాపులారిటీని పోగొట్టుకున్నాడు. 

సినిమా తీయడమే శ్వాసగా బతుకుతూ ఇండియన్ హిచ్ కాక్ గా పేరు సంపాదించిన వర్మ ప్రస్తుతం చేస్తున్న సినిమాల పట్ల ఆయన అభిమానులు ఎంతో నిరాశలో ఉన్నారు. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఓ సందర్భంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ తో కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది. తెలుగు చిత్రాల పోకడని శివ సినిమాతో పూర్తిగా మార్చివేసి ఓ ట్రెండ్ సృష్టించిన రామ్ గోపాల్ వర్మ నంది అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. 

రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ చిత్రం శివ తోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా వర్మ ఈ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు ఈ అవార్డు ప్రోగ్రాంలో ఏఎన్ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కూడా. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు చిన్నబ్బాయి నాగార్జున హీరోగా నటిస్తే పెద్దబ్బాయి అక్కినేని వెంకట్ తో పాటు ఎస్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్ లో అక్కినేని పెద్దల్లుడు యార్లగడ్డ సురేంద్ర చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇదే సినిమాని నాగార్జున అమల హీరోహీరోయిన్లుగా హిందీ లో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఏదేమైనా అప్పుడే వచ్చిన ఓ కొత్త దర్శకుడు ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో చేతులమీదుగా తొలి నంది అవార్డు అందుకోవడం ఎప్పటికీ విశేషమే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: