మహానటి అంటే టక్కున ఈ తరం వాళ్ళకి గుర్తుకువచ్చే పేరు కీర్తి సురేష్. నిజానికి మహానటి సినిమా సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన బయోపిక్ మూవీ. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన అమోఘం అనే చెప్పాలి. తన అందం, అభినయంతో అందరిని ఆకట్టుకుంది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహానటి చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకుంది. ఇందులో కీర్తి సురేష్ తన నటనతో అలనాటి గొప్ప నటి సావిత్రని సైతం మైమరపించినది అనే చెప్పాలి.


ఈ సినిమాలో సావిత్రి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు.అలాగే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కూడా ఒదిగిపోయి నటించడంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తమ గుండెల్లో పెట్టుకున్నారు. 2018లో ఈ మూవీ విడుదల అయింది.నాగ అశ్విన్ రెండేళ్ల కష్టం ఈ సినిమా. కీర్తి సురేష్ హీరో నానితో నేను లోకల్ సినిమా చేస్తున్న సమయంలో మహానటి సినిమా కోసం కీర్తి సురేష్‌ను సంప్రదించారట నాగ అశ్విన్. మొదట్లో కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించడానికి తటపటాయించిన తరువాత దర్శకుడు ఇచ్చిన ధైర్యంతోనే మహానటిలో నటించడం జరిగిందని కీర్తి సురేష్ చెబుతుంటారు.
కానీ మహానటి సావిత్రిలాగా నటించాలంటే కొంచెం కష్టం అయిన పనే. అది అందరికి సాధ్యం కాదు. అలా  సావిత్రిలా తెరపై కనిపించాలంటే సాధ్యమైన పనేనా.?


ఈ అనుమానంతోనే కీర్తి సురేష్‌కు అప్పట్లో లుక్ టెస్ట్ కూడా పెట్టారట. ఆ విషయాన్ని కీర్తి సురేష్ తాజాగా పంచుకున్నారు.ఈ క్రమంలో నాడు కట్టుకున్న చీరను, అక్కడ కీర్తి సురేష్ లుక్ ను టెస్ట్ చేస్తోన్న సమయంలో దిగిన ఫోటోను కీర్తి సురేష్ షేర్ చేశారు. హహ.. లుక్ టెస్ట్ చేసిన మొదటి రోజు.ఈ ఫోటో వెనకాల ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉన్నాయి అంటూ ఫోటోను తన అభిమానులకు షేర్ చేసింది కీర్తి సురేష్. కాటన్ చీర కట్టుకుని, భుజాల మీదుగా సాంతం కవర్ చేస్తూ ఉన్న పాతకాలంనాటి రవికే,ఎర్ర లంగా వేసుకుని ఉంది. అలాగే చేతికి పచ్చ గాజులతో  క్లాసిక్ డేస్ మెమరీస్ ని గుర్తు చేస్తోంది.మొత్తానికి పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు-తమిళంలో పెద్ద హిట్టయ్యింది. ప్రస్తుతం‌ కీర్తీ సురేష్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ‘సర్కారువారి పాట’లో కీర్తీ సురేష్‌ మహేష్ బాబుకి జోడిగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ చిత్రంలోనూ కీలక పాత్రలో కీర్తి నటించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: