టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కథలను ఎంచుకుని తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న హీరోలలో ఒకరుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి నిఖిల్. హ్యాపీడేస్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఆ తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోగా తన ప్రతిభను చాటుకుంటూ వస్తున్నాడు. చివరగా హీరో నిఖిల్ అర్జున్ సురవరం సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రస్తుతం కార్తికేయ 2, అలాగే 18 పేజెస్ అనే సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఇందులో 18 పేజెస్ సినిమాకు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నితిన్ కనిపించబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్.
నేడు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదగా ఎవరూ ఊహించని విధంగా 18 పేజెస్ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై హీరోయిన్ అనుపమ పోస్టర్ పై స్పందిస్తూ.. ‘తన పేరు నందిని అని, నాకు మొబైల్ లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం అంటే ఇష్టం అంటూనే.. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ అసలు ఉండవు.., ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయని అంటుంది. కానీ, రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ కచ్చితంగా ఉంటుందని.. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుందంటూ అనుపమ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. మొత్తంగా 18 పేజెస్ సినిమాకి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, అలాగే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి