తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు నెమ్మదినెమ్మదిగా  అదుపులోకి వస్తున్నాయి. పరిస్థితి త్వరగా చక్కబడుతోంది. దీనితో థియేటర్స్ ఓపెనింగ్ విషయంలో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. ఏప్రిల్ 9న ‘వకీల్ సాబ్’ విడుదలైన సందర్భంగా మన తెలుగు రాష్ట్రాలలో చాల థియేటర్లు కళకళలాడాయి.  అయితే ఈ సినిమా థియేటర్లలో ఉండగానే సెకండ్ వేవ్ విజృంభించింది.  


దీనితో ప్రభుత్వాలు థియేటర్స్ ఇంకా మూసివేసే నిర్ణయం తీసుకోకుండానే  జనం భయంతో థియేటర్స్ కు రావడం మానేయడంతో ఇరు రాష్ట్రాలలోను థియేటర్స్ ప్రభుత్వాలు ఇంకా ఆంక్షలు ప్రకటించకుండానే  స్వచ్చందంగా మూతపడ్డాయి. దీనితో ఏప్రిల్ లో విడుదల కావలసిన సినిమాలు అన్ని ఆగిపోయాయి. ఈపరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందో అర్థంకాక ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.


ఇలాంటి  పరిస్థితులలో ఎవరు ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ధియేటర్ తెర్రుచుకోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్  విశాఖ వాసులకు సుపరిచితమైన జగదాంబ థియేటర్ ను ఓపెన్ చేస్తున్నారు. గత సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్’ చిత్రాన్ని ఇందులో ప్రదర్శించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కర్ఫ్యూ సమయాన్ని ప్రభుత్వం సడలించిన పరిస్తితులలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని వ్యాపారాలు నడుస్తాయి.  దీనికితోడు వాస్తవంగా థియేటర్ల పై ఎలాంటి ఆంక్షలూ విధించలేదు.



అందువల్ల జగదాంబ ధియేటర్ యాజమాన్యం ప్రతిరోజు మార్నింగ్ షో ప్లాన్  చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి ఒక షో నడిపించేందుకు ఏర్పాట్లు  జరిగినట్లు తెలుస్తోంది. దీనితో  సెకండ్ వేవ్ కారణంగా మూతపడిన థియేటర్లలో తెరుచుకోబోతున్న మొదటి  ధియేటర్ జగదంబ కాబోతోంది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతోంది ఆంధ్రప్రదేశ్ లోని జగదాంబ థియేటర్ స్ఫూర్తితో  భాగ్యనగరంలో కూడ కొన్ని థియేటర్స్ ఇలాంటి  ప్రయోగాలు చేస్తే అసలు  మళ్ళీ జనం థియేటర్స్ వైపు వస్తారా అన్న విషయం తేలిపోతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: