వెబ్ సిరీస్ ల జోరు కూడా పెరిగింది. స్టార్ హీరోయిన్లు సైతం జత కావడంతో వీటికి ఫాలోవర్స్ భారీగా పెరుగుతున్నారు.
చిన్న సినిమాల నుండి భారీ ప్రాజెక్టుల వరకు చాలా సినిమాలు ఓ టి టి బాటపడుతున్నాయి. ఫ్యాన్సీ డీల్స్ ఇస్తుండడం తో క్రేజి చిత్రాలు సైతం ఒ టి టి లో రిలీజ్ అయ్యేందుకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే చాలా చిత్రాలు ఓటీటీ వేదికపై విడుదలయ్యి మిశ్రమ ఫలితాలను తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఇంకొన్ని సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ అయ్యాయి. చిత్రసీమలో మొదటి నుంచి వస్తున్న శుక్రవారం సెంటిమెంట్ అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఓటీటీ వేదికపై రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాయి. ఇక ఈ శుక్రవారం రిలీజ్ అయిన మూవీస్ ఏమిటో ఓ లుక్కేద్దాం. ఇందులో విద్యాబాలన్ నైటీనిచ్చిన షేర్ని మూవీ ఉంది. ఈ సినిమా అమెజాన్ లో విడుదల కానుంది. ప్రియదర్శి నైటీనిచ్చిన ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ మూవీ ఆహాలో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ధనుష్ నటించిన జగమే తంత్రం నెట్ ఫ్లిక్ లో విడుదల కానుంది. ఇవి కాకుండా ఫాదర్‌హుడ్, ది రేషనల్ లైఫ్, బ్లాక్ సమ్మర్ సీజన్ 2 , ఎ ఫ్యామిలీ, ఎలైట్ సీజన్ 4, అఫీషియల్ సీక్రెట్స్, ది అడ్వంచర్స్ ఆఫ్ పూల్ఫ్‌బాయ్, మోహన్ లాల్ నటించిన కమ్మర సంభవం కంటి మరికొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలో ఎన్ని వ్యూస్ సాధిస్తాయో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి