
మెగా వారసులలో చాలా మంది హీరోలు తమ తమ టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీ లో రాణించి మంచి క్రేజ్ ను సంపాదించుకొని స్టార్డమ్ ను అందుకున్నారు. దాదాపు అందరు మెగా హీరోలు తమ తమ సినిమాలతో దూసుకుపోతున్నారు కానీ ఒక అల్లు శిరీష కు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. మంచి టాలెంట్ , ఉన్న కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా అల్లు శిరీష్ మాత్రం సక్సెస్ దక్కడం లేదు. ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ సంస్థ తన సొంత కొడుకు హీరోగా నిలబెట్టుకోలేక పోతుండడం ఫ్యాన్స్ ను వేధిస్తోంది. అల్లు శిరీష్ గౌరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత వరుస ఫ్లాప్ సినిమాలతో వెనుకబడి పోయాడు.
ఆయన కెరీర్లో హిట్ సినిమా ఏది అంటే పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమా. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కొంత బాగా ఆడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత మళ్లీ ఆయన మొహం చూసింది లేదు. టాలీవుడ్ యువ హీరోలలోకెల్లా సక్సెస్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న అల్లు శిరీష్ కథల ఎంపికలో విభిన్నమైన ఆలోచనలే చేస్తున్న అవి బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్టు ఇస్తున్నాయి. తన కెరీర్లో ఓ మంచి సినిమాగా మిగిలిపోతుంది అనుకున్న ఒక్క క్షణం సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో రెండు సంవత్సరాలు ఆగి మరి ఏబిసిడి అనే సినిమా చేశాడు ఆ సినిమా కూడా ఫలితాన్ని మిగిల్చింది.
ఈసారి ఓ రొమాంటిక్ సినిమా చేస్తూ ఎలాగైనా ఆ సినిమాతో హిట్ అందుకోవాలనీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట అల్లు వారి అబ్బాయి. ఇందుకోసం తన ఫిట్నెస్ లో భారీగా మార్పులు చేస్తున్నాడు. ఇటీవలే ఒక వర్కౌట్ వీడియో రిలీజ్ చేయగా అందులో కండలు తిరిగిన అల్లు శిరీష్ నెవర్ బిఫోర్ అనేలా కనిపిస్తుండటం విశేషం. రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనూ ఇమాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమా అయిన అల్లు శిరీష్ నమ్మకాన్ని నిలబెడుతుందా.. ఆయనకు ఎంత వరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి. రాకేష్ శశి ఇంతకుముందు కళ్యాణ్ దేవ్ తో విజేత సినిమా చేసిన విషయం తెలిసిందే.