బాహుబలి సినిమా తర్వాత
ప్రభాస్ కి ఏ స్థాయిలో స్టార్‌డమ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఐతే
ప్రభాస్ మాత్రం ఎంత ఎదిగినా ఒదిగే ఉంటున్నారు.
టాలీవుడ్ సినిమా చరిత్రలో ఎవరికీ రాని క్రేజ్ వచ్చినప్పటికీ ఆయన మాత్రం ఎటువంటి డాంబికాలకు పోకుండా సాధారణ మనిషి లా వ్యవహరిస్తున్నారు. అయితే
ప్రభాస్ లోని ఈ లక్షణం
ఆది పురుష్
డైరెక్టర్ ఓం రౌత్ కి విపరీతంగా నచ్చేసింది. తాజాగా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ
ప్రభాస్ ని ఆకాశానికెత్తారు.
ఆయన మాట్లాడుతూ.. "
ప్రభాస్ లాంటి స్టార్ ని నేను ఇప్పటివరకూ చూడలేదు. అతను బిగ్ స్టార్ అయినప్పటికీ.. చాలా వినయంగా ఉంటారు. తనకున్న స్టార్‌డమ్ పూర్తిగా మర్చిపోయి అందరితో ఒక మంచి స్నేహితుడిగా మెలుగుతారు. అతని లాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అతను తన చుట్టూ ఉన్నవారిని ట్రీట్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది. ఆయన తన హోం ఫుడ్ ని ప్రతి ఒక్కరితో పంచుకోవటం కూడా నాకు బాగా నచ్చుతుంది. అటువంటి మంచి గుణాన్ని ఏ స్టార్ హీరోలో కూడా నేను చూడలేదు. ఇతర స్టార్స్ తో పోల్చుకుంటే
ప్రభాస్ చాలా వినయం గా ఉంటారు. తానే గొప్పవాడిననే అహంకారం
ప్రభాస్ లో ఏ మాత్రం కనిపించదు. చాలా వినయం గా ఉంటూ ప్రతి ఒక్కరిని సమానంగా ట్రీట్ చేస్తారు, " అని
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చారు.
ఇకపోతే సన్నిహితులు కూడా
ప్రభాస్ గురించి గొప్పగా చెబుతుంటారు.
ప్రభాస్ చాలా ఫ్రెండ్లీ గా ఉంటారని.. ఆయన ఎంత సింపుల్ గా ఉంటారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయమని.. ఒక్కసారి అతనితో పరిచయం ఏర్పడితే వదులుకోవడం దాదాపు అసాధ్యమని సన్నిహితులు చెబుతుంటారు. ప్రస్తుతం
ప్రభాస్ "సలార్" చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన వంద కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.