సౌత్ లో టాప్ హీరోయిన్ లు అయిన కాజల్, తమన్నా లు నటించిన బాలీవుడ్ సినిమా క్వీన్ ను తమిళ తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ సినిమా విడుదలకు ముహూర్తం కుదిరింది అని తెలుస్తుంది. బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ సినిమాకు బాలీవుడ్ లో భారీ అభిమానాన్ని అందుకుందని నిర్మాతలు ఇక్కడ మంచి విజయం సాధిస్తుందని నాలుగు భాషల్లో నలుగురు హీరోయిన్ లను పెట్టి సినిమా తీయడం మొదలుపెట్టారు.

నలుగురు హీరోయిన్లతో సినిమాను ఒకేసారి పార్లల్ గా తెరకెక్కించడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  అయితే ఈ సినిమాలో బూతు డైలాగులు ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా రిలీజ్ చేయాలంటే వాటిని కత్తిరించాలి అని సెన్సార్ బోర్డు ఒక ప్రతిపాదన పెట్టారు.  అయితే ఈ సినిమా నిర్మాతలకు అది ఇష్టం లేక ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ లోపు కరోనా రావడం థియేటర్లు మూసివేయడంతో ఈ సినిమా ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీ లో  సినిమాలను భారీ రేటు తో కొనడంతో ఈ సినిమాను కూడా ఓ టీ టీ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. 

సెన్సార్ సమస్య ఉన్న ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల చేస్తే బాగుంటుందని ఓ పెద్ద ఓటీటీ సంస్థతో చర్చలు జరుపుతున్నారట నిర్మాతలు.  ఇది పూర్తికాగానే విడుదల తేదీని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తారట. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమాగా ఉన్నారు.  తెలుగు వెర్షన్ లో సినిమా కి తమన్నా హీరోయిన్ నటించారు. తమిళంలో లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.  మరి బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమా సౌత్ లో ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. కన్నడ లో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమ మోహన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: