
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా మారి మినిమం బడ్జెట్ సినిమాలను, ప్రజలను ఆకట్టుకునే సినిమాలను, వెరైటీ కథనంతో కూడుకున్న సినిమా ప్రేక్షకులను చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. కరోనా కారణం గా ఈ సినిమా విడుదల వాయిదా అయింది లేదంటే ఈపాటికి ఈ సినిమా విడుదల కూడా అయ్యేది కూడా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే ఆయన నిర్మాతగా రూపొందించిన మేజర్ సినిమా శాటిలైట్ హక్కులు మంచి రేటు కి వెళ్లాయి అని సమాచారం. జి ఎం బి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నీ తెరకెక్కిస్తున్నారు. ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి .గూడచారి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శశి కిరణ్ టిక్కా ఈ సినిమా కి దర్శకుడు. త్వరలోనే విడుదల అవుతుంది.
అయితే ఈ సినిమా హిందీ శాటిలైట్ ఒక ప్రముఖ ఛానల్ 10 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మహేష్ బాబు తో పాటు సినిమా నిర్మాణంలో సోనీ పిక్చర్స్ కూడా ఉన్న విషయం తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈ ఏడాది మొదట్లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా వల్ల ప్లాన్స్ తారుమారయ్యాయి. వీలైనంతవరకు థర్డ్ వేవ్ ఉండకపోతే త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి వారి ఆలోచన ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శోభిత ధూళిపాళ నటిస్తుండగా, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.