'అర్జున్ రెడ్డి' సినిమాతో నేషనల్ వైడ్ గా సూపర్ స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ 2020లో తన తదుపరి సినిమా "లైగర్" కి సంబంధించి షూటింగ్ ప్రారంభించారు. కానీ ఆ సినిమా షూటింగ్ ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణంగా పూరి జగన్నాథ్ తన సినిమాలను 5 నుంచి 6 నెలల లోపు పూర్తి చేస్తారు కానీ ఈసారి కరోనా కారణంగా ఆయన లెక్క తప్పింది. ఈ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి మేజర్ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందని సమాచారం.

అయితే సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ పై ఒత్తిడి చేస్తున్నారట. ఈ రౌడీ బాయ్ సుకుమార్, గౌతమ్ తిన్ననూరి, శివ నిర్వహణ వంటి టాప్ దర్శకులతో కలిసి సినిమాలు చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరగా లైగర్ సినిమా పూర్తి చేసి ఆయన అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడానికి ఉవ్విళూరుతున్నారు కానీ పూరి సినిమాకి సంబంధించి 30 నుంచి 40 శాతం షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో విజయ్ దేవరకొండ 3 నెలల సమయంలోనే సినిమా మొత్తం పూర్తి చేయాలని పూరి జగన్నాథ్ ని కోరినట్లు సమాచారం. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదాపడిన లైగర్ చిత్ర షూటింగ్ జూన్ నెలలోనే ప్రారంభం అవుతుందని అందరూ భావించారు కానీ అలా జరగలేదు. హైదరాబాద్ లో పునః ప్రారంభం కానుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం కాలేదని సమాచారం.

ఐతే తాజా నివేదికల ప్రకారం.. షూటింగ్ ప్రారంభించకపోవడానికి గల కారణం ఏమిటో తెలిసింది. పూరి జగన్నాథ్ తన సినిమాలోని ఇంటెన్స్ ఫైట్స్ కి తగ్గట్టుగా లోకేషన్స్ బ్రహ్మాండంగా ఉండాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన తాజాగా విదేశాలకు వెళ్లారట. అంతేకాకుండా అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారట. అలాగే, సెప్టెంబర్ నెల నుంచి విదేశాల్లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభించడానికి ప్లాన్ చేశారని టాక్. ఇకపోతే ఈ యాక్షన్ సినిమాలో మిక్సడ్ మార్షల్ ఆర్టిస్ట్ విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. మొత్తం షూటింగ్ పూర్తైన వెంటనే మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: