టాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో మైమరపించిన బ్యూటీ స్నేహ గురించి అందరికీ సుపరిచితమే. తాను చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఏ ఒక్క సినిమాలోనూ స్కిన్ షో చేయలేదు. కేవలం తన నటనతోనే వేలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. చాలా మంది అగ్రహీరోల సరసన నటించే ఛాన్సు కొట్టేసింది. సినిమా ఇండస్ర్టీకే చెందిన నటుడు ప్రసన్న ను పెళ్లి చేసుకుని హీరోయిన్ పాత్రలకు పుల్ స్టాప్ పెట్టింది. అయినా కానీ నటించడం మీద ఉన్న మమకారంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేసి అడపాదడపా సినిమాల్లో మెరుస్తుంది. అయితే పెళ్లికి ముందు చేసిన హీరోయిన్ క్యారెక్టర్లు కాకుండా పెళ్లి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయి బాగానే క్రేజ్ సంపాదించుకుంది. పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఇక తన భర్త కూడా తెలుగు సినీ ప్రేక్షకులకు సపరిచితడే. ప్రసన్న కూడా తెలుగులో అప్పుడప్పుడు తళుక్కుమంటూ ఉంటాడు.


అసలు విషయం ఏంటంటే.... ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తోంది. దీని నుంచి రక్షణ పొందేందుకు అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ కొంత మంది వ్యాక్సిన్ వేసుకునే సమయంలో చాలా భయపడిపోతున్నారు. ఇటీవల అందాల అమ్మడు స్నేహ కూడా వ్యాక్సిన్ వేసుకుంది. కానీ ఆమె సూది మందుకు భయపడి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాను చేసిన చేష్టలతో వ్యాక్సిన్ వేసే సిబ్బంది కూడా చివరకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తింది. సూది వేసేందుకు నర్సు ముందుకు రాగా... నటి స్నేహ భయపడడం చూస్తే నవ్వాపుకోలేదు. స్నేహకు వ్యాక్సిన్ అంటే ఇంత భయమా అన్న సందేహం చూసిన వారిలో తప్పక కలుగుతుంది. ఆమె భయపడిన విధానాన్ని నటుడు ఆమె భర్త ప్రసన్ననే స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. తాజాగా దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: