ఇక్కడ తిరుగులేని క్రేజ్ తో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఆమె బాలీవుడ్‌ను ఏలేయాలని అక్కడకు చెక్కేసింది. అక్కడ రెండు మూడు సినిమాల్లో ఛాన్స్ వచ్చినా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని ఆమె తిరిగి తెలుగులోకి వచ్చినా అప్పటికే ఇక్కడ యంగ్ హీరోయిన్లు దూసుకు పోవడం.. ఆమె ఫేడవుట్ అయిపోవడంతో ఆమెను పట్టించుకన్న వాళ్లు లేరు. ఎలాగోలా రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేసినా అది కూడా ప్లాప్ అవ్వడంతో ఇలియానా పూర్తిగా అవుట్ డేటెడ్ అయిపోయింది.
కొన్నాళ్ల పాటు ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫ్ ఐ ఆండ్రూ తో డేటింగ్ చేసిన ఆమె ఉన్నట్టుండి అతడితో విడిపోయింది. ఇందుకు కారణం ఏంటన్నది చాలా మందికి తెలియలేదు. బాలీవుడ్ లో భార్యకు విడాకులు ఇచ్చిన ఓ సీనియర్ హీరోతో ఆమె ప్రేమలో ఉండడమే కారణం అంటున్నారు. పైగా అతడు మరో పెళ్లయిన మాజీ హీరోయిన్ ( ఓ స్టార్ హీరో భార్య) తో కొన్నాళ్లు డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఆమెను వదిలేసి ఇలియానాను పట్టాడట. అతడి మోజులో పడిన ఇల్లూ బేబీ చివరకు ఆండ్రూకు దూరమైనట్టు టాక్ ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి