నిన్న విడుదలైన ‘నారప్ప’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ ప్రియమణి ఇలా వీరిలో ఎవరి ఇమేజ్ ని పెద్దగా పెంచక పోయినా ఒక యంగ్ యాక్టర్ కు ‘నారప్ప’ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఓటీటీ లో విడుదలైన ఈ మూవీని చూసి సాధారణ ప్రేక్షకుల నుండి విమర్శకుల వరకు పెదవి విరుస్తుంటే ఈమూవీలో వెంకటేష్ పెద్ద కొడుకుగా నటించిన కార్తిక రత్నం కు మంచి పేరు తెచ్చిపెడుతోంది.


‘కేరాఫ్ కంచరపాలెం’ మూవీకి సగటు ప్రేక్షకుడు నుండి ప్రశంసలు లభించడమే కాకుండా ఈ మూవీకి దర్శకత్వం వహించిన దర్శకుడు వెంకటేష్ మహా కు చాల మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈమూవీ ద్వారా కార్తిక్ రత్నం ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేయబడ్డాడు. ఆతరువాత ‘అర్థశతాబ్దం’ మూవీలో ఈ నటుడు కీలక పాత్రను చేసినప్పటికీ ఆమూవీ అతడికి సరైన బ్రేక్ ఇవ్వలేకపోయింది.


ఇప్పుడు ‘నారప్ప’ లో అణిచివేతకు గురి కాబడుతున్న ఒక వర్గానికి చెందిన యువకుడు పాత్రలో కార్తిక రత్నం చూపించిన నట ప్రతిభకు ఈమూవీని ఓటీటీ లో చూస్తున్న ప్రేక్షకులు ఎంజాయ్ చేయడమే కాకుండా అతడి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వాస్తవానికి వెంకటేష్ తన కెరియర్ లో ఏ సినిమాకు కష్టపడని విధంగా ఈమూవీ కోసం కష్టపడి బాగా నటించినా వెంకటేష్ నటన సగటు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.


ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ప్రియమణి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఈమూవీ ద్వారా ప్రారంభించినా ఆమెకు కూడ సరైన గుర్తింపు రాలేదు. అయితే కార్తిక రత్నం కు ఈమూవీ టర్నింగ్ పాయింట్ గా మారి చాల అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. ఈమూవీని ప్రస్తుత పరిస్థితులలో ధియేటర్లలో విడుదల చేసే సాహసం చేయకుండా మంచి అంచనాలు ఉన్నప్పటికీ వాటిని పక్కకు పెట్టి నిర్మాత సురేష్ బాబు ఓటీటీ లో విడుదల చేసిన సేఫ్ గేమ్ సక్సస్ కావడంతో ఇదే మార్గాన్ని మరికొందరు ప్రముఖ నిర్మాతలు అనుసరించినా ఆశ్చర్యం లేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: