ఇటీవల కాలంలో బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఒకరి వెనక మరొకరు హీరోలు, హీరోయిన్లుగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. సుధీర్, ప్రదీప్‌తో పాటు రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’లో పార్టిసిపేట్ చేసిన మోనాల్ గజ్జర్, అఖిల్, అరియానా తదితరులు టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చారు. ఈ క్రమంలో బిగ్ బాస్ చూసిన వారిందరికీ గుర్తుండే కౌశల్ మండా కూడా తాజాగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్‌గా నిలిచి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్న కౌశల్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో ఇచ్చేశాడు. అయితే, హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశాడు కౌశల్.
 
ఈ క్రమంలోనే కౌశల్ సాయికుమార్ తనయుడు ఆది నటిస్తున్న ‘బ్లాక్’సినిమాలో పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే, తాజాగా హీరో రోల్ ప్లే చేయబోతున్నాడు కౌశల్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్ స్టా వేదికగా ప్రకటించాడు. దీంతో బిగ్ బాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘రైట్’ అనే సినిమాలో కథనాయకుడిగా నటించబోతున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా, అది నెట్టంట ట్రెండవుతోంది.


ఈ ‘రైట్’ సినిమాకు మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘దృశ్యం’ ఫేమ్ రైటర్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్టోరీ అందించడం విశేషం. ఈ నేపథ్యంలోనే తనను మూడేళ్లుగా అభిమానిస్తూ పీపుల్ స్టార్ అని పిలుస్తున్న ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పాడు కౌశల్. తనకు అవకాశం ఎప్పుడొస్తుంది? తనతో పాటు అభిమానులు వెయిట్ చేస్తున్నారని తెలిపాడు. రైట్ మూవీ ముహుర్తం షాట్ మీతో పంచుకుంటున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఎప్పటిలాగే అందరి ఆశీస్సులు తనకు, తన మూవీ యూనిట్‌కు కావాలని కోరాడు కౌశల్ మండా. ఈ సంగతులు ఇలా ఉండగా ఇన్నాళ్లకు బిగ్ బాస్ పార్టిసిపెంట్ ప్లస్ విన్నర్ అయిన కౌశల్‌ హీరో అవుతుండటంతో అభిమానులు ఆనందపడుతున్నారు. అయితే, పీపుల్‌ స్టారా? అదెక్కడిది? ఎప్పుడు పెట్టారు? ఈ మధ్య ఎవరికి వాళ్లే స్టార్‌ ట్యాగ్‌ తగిలించుకోవడం ప్యాషన్‌ అయిపోయింది అంటూ కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కౌశల్ ప్రయాణం బుల్లితెర టు వెండితెర వరకు అద్భుతంగా సాగిందని పలువురు పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: