
వాటిలో ఇప్పటికే శివ నిర్వాణ తో చేస్తున్న టక్ జగదీశ్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. మరోవైపు రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ మూవీ నేడు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. నేడు ఈ సినిమా షూట్ పూర్తి కావడంతో కొద్దిసేపటి క్రితం నాని తన సోషల్ మీడియా అకౌంట్స్ శ్యామ్ సింగ రాయ్ షూట్ స్పాట్ నుండి ఒక వీడియో పోస్ట్ చేసారు.
నేను మీ డాక్టర్ శ్యామ్, మనకు వచ్చింది ఒక్కటే, నేటితో శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ పూర్తి అయింది, అంటూ తన మీసాలు ట్రిమ్ చేస్తూ అంటే సుందరానికి మూవీ షూట్ లో జాయిన్ అవుతున్నట్లు చెప్పారు నాని. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. మొత్తానికి నాని నటిస్తున్న రెండు సినిమాలు కొద్దిపాటి గ్యాప్ లో విడుదల కానుండడంతో ఫ్యాన్స్ మంచి ఆసక్తిగా వాటి కోసం ఎదురు చూస్తున్నారు. మరి వాటితో నాని ఏ స్థాయి విజయాలు అందుకుంటారో చూడాలి .... !!