అలనాటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మన జయప్రద కూడా ఒకరు. జయప్రద కేవలం నటన తో మాత్రమే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయలేదు.. ఆమె అందం,  ధైర్యం, అణుకువతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఇక అంతే కాదు ఆ కాలంలో ఒక స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. జయప్రద 1962 వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన రాజమండ్రిలో జన్మించింది. వీరిది ఒక మధ్య తరగతి కుటుంబం. ఇక ఈమె తల్లి పేరు నీలవేణి ,తండ్రి కృష్ణ.

జయప్రదకు నాట్యం అంటే ఇష్టం ఉండడంతో ఈమె తల్లి నీలవేణి ,జయప్రద ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి సంగీతం అలాగే నాట్యం నేర్చుకోవడానికి పంపించేది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈమె తండ్రి అలాగే చిన్నాన్న  ఇద్దరు సినిమా నిర్మాతలు అయినప్పటికీ, ఈమెకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తెప్పించ లేకపోయారు. నాట్యంలో నాట్య మయూరి గా గుర్తింపు తెచ్చుకున్న జయప్రద తన 14 సంవత్సరాల వయసులో , ఒక స్టేజిపై నాట్య ప్రదర్శన ఇస్తున్న సమయంలో, ప్రముఖ సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ఆమెను చూసి, ఆమెకు సినిమాలలో అవకాశం కల్పించాడు.

అలా మొదటి సారి 1976 సంవత్సరంలో వచ్చిన భూమి కోసం అనే చిత్రంలో కేవలం మూడు నిమిషాలు మాత్రమే నటించింది. ఇక ఆ తర్వాత 300 పైగా  సినిమాలలో నటించి ,తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె ఇంటిని ఎందుకు కూల్చివేశారు అనే విషయానికి వస్తే ,రాజమండ్రి లో పుట్టి పెరిగిన తన సొంత ఇల్లును, సొంతంగా ఆమె కూల కొట్టింది. ఇందుకు గల కారణం ఏమిటంటే,  ఆమె సొంత ఇల్లు ఉన్న ప్రదేశంలో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం కోసం మాత్రమే, ఆమె తన ఇంటిని కూల కొట్టింది. అయితే ఆమె జ్ఞాపకార్థం గా ఉన్న ఇల్లు ను కూడా కూల్చేయడంతో ఆమె అభిమానులు కొంచెం బాధ పడ్డారు అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: