టాలీవుడ్‌ పరిశ్రమలో హీరో నితిన్‌ ఎంతో కష్టపడి.. మంచి స్థాయికి వచ్చాడు. అతని కెరీర్‌ మొదట్లో జయం, సై లాంటి సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత హిట్‌ కోసం చాలా శ్రమించాడు. గుండె జారీ గల్లంతైయిందే మూవీతో మళ్లీ హీరో నితిన్‌ ఫామ్‌ లోకి వచ్చాడు. అయితే... నితిన్‌... హీరో గానే కాకుండా చాలా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అందులో ఒకటి... ''అఖిల్‌- ది పవర్‌ ఆఫ్‌ జువా''. ఈ సినిమా అక్కినేని అఖిల్‌ కు అరంగేట్ర చిత్రం.

వాస్తవానికి అక్కినేని అఖిల్‌ మరియు హీరో నితిన్‌ ఇద్దరూ ప్రాణ స్నేహితులు, ఆ స్నేహమే హీరో నితిన్‌ ను''అఖిల్‌'' సినిమా నిర్మాతగా నిలబెట్టింది. అక్కినేని అఖిల్‌... తొలి సినిమానే నితిన్‌ కు అప్పగించారంటే మనం ఆలోచించుకోవచ్చు... వాళ్లిందరూ ఎంత మంచి మిత్రులనేది. ఎంతో మంది టాప్‌ డైరెక్టర్లు ఉన్నప్పటికీ... యంగ్‌ హీరో నితిన్‌ కు అక్కినేని నాగార్జున అఖిల్‌ సినిమా బాధ్యతలను అప్పగించాడు. ఇక ఈ అఖిల్‌ సినిమాకు హీరో నిర్మాతగా వ్యవహరించగా...వీవీ వినాయక్‌ దర్శకత్వం వహించారు. అలాగే... ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్‌ అందించగా... వెలిగొండ శ్రీనివాస కథను అందించారు. ఇక సినిమాలో హీరో అఖిల్‌ సరసన సయ్యేషా నటించింది.

అటు ఈ అఖిల్‌ సినిమాను 50 కోట్ల బడ్జెట్‌ తో చేశారు. అయితే.. అఖిల్‌ సినిమా టాలీవుడ్‌ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నిర్మాత నితిన్‌ కు ఈ అఖిల్‌ సినిమా పీడకలనే మిగిల్చింది. డిస్ట్రిబ్యూటర్‌ నుంచి ఎగ్జిబిటర్‌ వరకు ప్రతి ఒక్కరూ నష్టపోయారు. అటు హీరో అఖిల్‌ కూడా డీలా పడిపోగా..అక్కినేని ఫ్యామిలీ మరియు నితిన్‌ ల మధ్య చాలా వరకు గ్యాప్‌ పెరిగిపోయింది. కానీ.. నితిన్‌ మరియు అఖిల్‌ మధ్య స్నేహ బంధం చాలా బలంగానే ఉంది. అఖిల్‌ కు హిట్‌ ఇవ్వలేకపోయాను...కచ్చితంగా త్వరలోనే హిట్‌ ఇస్తానని లై సినిమా ప్రమోషన్స్‌ లో నితిన్‌ అన్నారు. ఇదే నితిన్‌, అఖిల్‌ మధ్య స్నేహ బంధానికి నిదర్శనం. హిట్‌, ప్లాప్‌ లతో సంబంధం లేకుండా వారిందరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలోనూ వీరిద్దరూ చాటింగ్‌ కూడా చేసుకుంటారట. ఒకరంటే.. మరోకరికి చాలా అభిమానం.


మరింత సమాచారం తెలుసుకోండి: