రాజమౌళి సినిమా నుండి చిన్న పోస్టర్ వస్తేనే సంచలనం అవుతుంది. అలాంటిది భారీ అంచనాలతో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ నుండి పాట అంటే ఎలా ఉంటుంది. ముందునుండి ఆ సాంగ్ హింట్ ఇస్తూ అంచనాలు పెంచేసిన టీం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కీరవాణి సంగీత సార్ధ్యంలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలకు సంబందించిన సింగర్స్, మ్యూజిక్ డైరక్టర్స్ తో దోస్తీ ప్రయోగం అదిరిపోయింది. ముఖ్యంగా ఏ భాషకు సంబందించిన సాంగ్ ను ఆ భాషకు సంబందించిన వారిని హైలెట్ చేస్తూ చేసిన విధానం అదిరింది.

మరి రాజమౌళి ప్లాన్ అంటే ఈ రేంజ్ లోనే ఉంటాయి. దోస్తీ సాంగ్ ఎలా ఉంది అని చెప్పడానికి మాటలు సరిపోవని చెప్పాలి. సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం.. కీరవాణి మ్యూజిక్ రెండు ఒక దానికి ఒకటి పోటీ పడ్డాయి. ఇక లేటెస్ట్ గా రిలీజైన ఈ దోస్తీ సాంగ్ ఐదు భాషల్లో రిలీజైంది. అయితే ఈ సాంగ్ తెలుగు వర్షన్ కన్నా తమిళ వర్షన్ కు ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఆల్రెడీ తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ మంచి ఫాం లో ఉన్నాడు. అలాంటి స్టార్ మ్యూజిక్ డైరక్టర్ ను ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ సాంగ్ చేయించి సినిమాపై అక్కడ క్రేజ్ పెరిగేలా చేశారు.

తెలుగులో హేమ చంద్ర ఆలపించిన ఈ సాంగ్ ను తమిళంలో అనిరుధ్ పాడారు. తెలుగు వర్షన్ సాంగ్ కన్నా తమిళ పాటకే ఎక్కువ లైక్స్ పడుతున్నాయి. అనిరుధ్ స్వతహాగా మ్యూజిక్ డైరక్టర్ అవడం తన సినిమాలకు ఇలా ప్రమోషనల్ సాంగ్స్ చేయడం అతనికి బాగా అలవాటు అందుకే దోస్తీ సాంగ్ లో అతను అదరగొట్టేశాడు. ఈ దోస్తీ ప్రమోషనల్ సాంగ్ చివర్లో చరణ్, ఎన్.టి.ఆర్ వచ్చిన తీరు.. వారి స్టైల్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. సాంగ్ ప్రోమోనే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందో అని అంచనాలు పెంచుకుంటున్నారు ఆడియెన్స్.





మరింత సమాచారం తెలుసుకోండి: