టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి దాదాపు 15 సంవత్సరాలు గడుస్తోంది.. వయసు 30 ఏళ్లు దాటుతోంది. గత ఏడాది గౌతం కిచ్లు ని ప్రేమించి పెళ్లి చేసుకుని గృహిణిగా సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. ఇన్నేళ్లు గడుస్తున్నా , వయసు మూడు పదులు దాటుతున్నా, వివాహం అయినా కూడా ఆమె క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు సరికదా, ఫుల్ స్పీడ్ తో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ పొజిషన్ అలాగే కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్ లతో యువత మనసులు కొల్లగొడుతున్నారు. ప్రస్తుతం ఈ చందమామ చేతిలో చిరుతో ఆచార్య మూవీ, కమల్ హాసన్ తో భారతీయుడు 2 మూవీ, అంతే కాకుండా ఇటు తెలుగు అటు తమిళ్ లో కలిపి అరడజనకు పైగానే సినిమాలకి సైన్ చేసి బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా కాజల్ కు సంబంధించి ఓ న్యూస్ సెన్సేషనల్ గా మారింది. ఈమె నటించే ఓ తెలుగు చిత్రంలో భర్త గౌతమ్ కిచ్లుకి ఓ కీలక పాత్ర రెడీ చేయాలంటూ డిమాండ్ చేసిందట కాజల్. అయితే ఈమె ఆంక్షకు దర్శక నిర్మాతలు కూడా సరే అన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గౌతమ్ కిచ్లు కోసం కథలో ఓ పాత్రను యాడ్ చేసి మరి ఇవ్వబోతున్నారట. వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనని సమాచారం . గౌతమ్ కిచ్లు ప్రేమగా తనకు ఓ  స్క్రీన్ పై కనిపించాలని ఉంది అని సరదాగా అనడంతో.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కాజల్ తన భర్త కోసం పాత్ర ఇవ్వమని దర్శకుడిని అడిగినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఈ విషయం వింటుంటే కాజల్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. మరి ఇంతకి ఈ వార్త నిజమేనా అంటే మును ముందు దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కాజల్ ఫ్యాన్స్ ఈ వార్తని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈమె విధంగా ఎవరైనా చేశారా అంటే లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేని కిచ్లు కు అవకాశం ఇచ్చినా ఏ విధంగా ఆ పాత్రకు న్యాయం చేస్తాడో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: