విజయ్ సేతుపతి... సౌత్ ఇండస్ట్రీలోనే ఆ పేరు ఒక సెన్సేషన్. ఎలాంటి పాత్రలోనైనా జీవించేసే నటుడు. అందుకే విజయ సేతుపతికి కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే చాలామంది తెలుగు ప్రేక్షకులకు విజయ్ సేతుపతి ఫ్యామిలీ గురించి అసలు తెలియదు. ఆయన ఫ్యామిలీతో కలిసి బయట ఎక్కువగా కనిపించకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. తాజాగా విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో సూర్య యాక్షన్ సన్నివేశాలు ఇరగదీశాడు. వీడియో చూస్తుంటే  స్నేహితుడితో కలిసి కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రాక్టీస్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. 'మనద మైలాడ' ఫేమ్ గోకుల్‌తో కొన్ని యాక్షన్ సీన్స్ లో సూర్య కొట్టడం, తన్నడం, రక్షించుకోవడం కన్పిస్తోంది. అక్కడక్కడా స్లో మోషన్ తో ఎడిట్ చేసిన ఈ వీడియో చూస్తుంటే సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోంది. తమ అభిమాన నటుడి కుమారుడు ఆయనకంటే ఏం తక్కువ కాదని విజయ్ సేతుపతి అభిమానులు సంబరపడి పోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోను షేర్ చేస్తూ ఫ్యూచర్ రాక్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి యాక్షన్ కామెడీ మూవీ 'నేనుమ్ రౌడీ ధాన్'లో చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రం 2015లో వెండితెరపై ప్రేక్షకులను అలరించింది.    

మరోవైపు విజయ్ సేతుపతి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మణిరత్నం, జయేంద్ర పంచపాకేశన్ సమర్పణలో రాబోతున్న తొమ్మిది భాగాల నెట్‌ఫ్లిక్స్ సంకలనం 'నవరస' విడుదల కోసం విజయ్ సేతుపతి ఎదురు చూస్తున్నారు. బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో 'ఎదిరి' అనే మూవీలో ప్రకాష్ రాజ్, రేవతి, అశోక్ సెల్వన్ లతో పాటు విజయ్ సేతుపతి కనిపించనున్నారు. రాబోయే అత్యంత ఇంటరెస్టింగ్ కుకింగ్ రియాలిటీ షో "మాస్టర్ చెఫ్ తమిళ్‌"కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షాహిద్ కపూర్, రాశి ఖన్నాతో కలిసి థ్రిల్లర్-డ్రామా వెబ్ సిరీస్ కోసం పని చేయబోతున్నాడు.అంతేకాదు 'కాతువాకుల రెండు కాదల్', 'ముంబైకర్'లలో కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: