ఇక ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటించారు. ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించారు. అయితే సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. స్టూడెంట్ లీడర్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు విజయ్ మరోసారి స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. కాగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
అయితే కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' సినిమాను చిత్రీకరిస్తున్నాడు. ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక అనంతరం విజయ్ తో ఒక సినిమా చేయడానికి కొరటాల ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. కాగా.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కొరటాల ఓ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయినట్లు సమాచారం.
ఇక ఇప్పుడు అదే స్టొరీతో విజయ్ హీరోగా సినిమా చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఇందులో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడని సమాచారం. అంతేకాక.. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమాలో నటిస్తున్నారు. ఆ తరువాత సుకుమార్, శివ నిర్వాణ ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటి తర్వాత కొరటాల ప్రాజెక్ట్ ఉండే అవకాశముందని సమాచారం.