ఇక ఇదంతా ఒకవైపు అయితే మరొకవైపు ఈ మహమ్మారి ధాటికి సినిమా పరిశ్రమ ఎంతో విలవిలలాడుతోంది. ఎప్పటినుండో సినిమా థియేటర్స్ చాలా వరకు మూతబడే ఉన్నాయి. మధ్యలో కొన్ని సినిమాలు విడుదలైనప్పటికీ థర్డ్ వేవ్ భయంతో వాటిని మళ్ళి మూసివేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే పలు షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు మాత్రం వరుసగా ఇటీవల విడుదల తేదీలను అనౌన్స్ చేస్తుండడంతో అసలు ఇవి అనుకున్న తదీకే రిలీజ్ అవుతాయా లేదా అనే అనుమానాన్ని కొందరు ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఇటీవల సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, పుష్ప వంటి సినిమాలు విడుదల తేదీలు ప్రకటించగా ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా తాము గతంలో ప్రకటించిన విధంగానే అక్టోబర్ 13న వస్తున్నట్లు తమ పోస్టర్స్ లో ప్రకటిస్తోంది. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే అందరూ కూడా తమ తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని పైకి గటిట్గా ప్రకటించినప్పటికీ లోలోపల మాత్రం అసలు అవి అనుకున్న తేదీకి విడుదల చేయగలమా లేదా, రాబోయే రోజుల్లో అసలు పరిస్థితులు ఎలా మారుతాయో అనే సందిగ్ధంతో పాటు లోలోపల వెన్నులో ఒకింత వణుకు తో భయపడుతున్నారని అంటున్నాయి పలు సినీ వర్గాలు. ఏది ఏమైనప్పటికీ కొన్నాళ్ల పాటు సమయం గడిస్తేనే కానీ ఈ బడా సినిమాలు అన్ని అనుకున్న తేదీకి వస్తాయా లేదా అనేది తేల్చి చెప్పలేమని అంటున్నారు కొందరు సినిమా ప్రముఖులు ..... !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి