సినిమా అంటే కొంతమంది దర్శకులు అయిన హీరోలు అయిన కమర్షియల్ పంథాలో తీయడానికి ఇష్టపడుతుంటారు. దానికి ప్రధాన కారణం కమర్షియల్ సినిమాల విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయనవసరం లేదు. మరియు రిస్కు కూడా చాలా తక్కువగా ఉంటుంది. సినిమా హిట్ అయ్యే పర్సంటేజ్ కూడా కమర్షియల్ సినిమాలకు కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ అదే ఒక డిఫరెంట్ సినిమా చేయాలంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఒక స్టార్ హీరో దగ్గరికి వెళ్లి డీగ్లామర్ పాత్ర చేయమంటే అతనికి ఆ పాత్ర మీద ఎంత ఇష్టం ఉన్నా కూడా ఆ హీరో స్టార్ స్టేటస్, మరియు తన అభిమానులు ఈ పాత్రలో తనని చూడడానికి ఇష్ట పడతారో లేదో అనే ఉద్దేశంతో ఆ పాత్రలను వదిలిపెడతారు.


 కానీ ఇలాంటి డిగ్లామర్ పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుండే తమిళ తంబీలు మరోసారి ఆ విషయాన్ని రుజువు చేసుకున్నారు. అప్పట్లో కోలీవుడ్ లో సూర్య ,విక్రమ్ లాంటి హీరోలు పూర్తి డిగ్లామర్ పాత్రలో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం అదే కోవలో కొలీవుడ్ హీరోలు అయిన శింబు, రాఘవ లారెన్స్  పయనిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ ఇద్దరి హీరోల సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలు పెంచడం మాత్రమే కాకుండా ఈ హీరోల లుక్ నీ చూసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. హీరో శింబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో ఆ పాత్రకు సంబంధించిన ఒక లుక్ ను విడుదల చేశారు. దానిలో శింబు పూర్తి డిగ్లామర్ గా కనిపిస్తున్నాడు. రాఘవ లారెన్స్ కూడా తన స్వీయ దర్శకత్వంలో 'దుర్గ'  అనే సినిమాలో నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఒక సినిమా పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అందులో లారెన్స్ గుబురు గడ్డంతో, మీసాలతో గంభీరమైన లుక్ లో ఉన్నాడు. ఈ పోస్టర్స్ ని చూసిన తెలుగు వాళ్ళు కొందరు మన హీరోలు ఎందుకు ఇలా డిగ్లామర్ పాత్రలు చేయడానికి ఇష్టపడరు అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మన తెలుగులో ఇంత డిగ్లామర్ పాత్రలు ఎక్కువగా రాకపోవడానికి కారణం మొదటగా ప్రేక్షకులు అనే చెప్పవచ్చు. వారు తమ అభిమాన హీరోలను  అలా ఊహించుకోరు. ధైర్యం చేసి ఏ హీరో అయిన అలాంటి పాత్రలు లు ప్రయత్నిస్తే ఆ హీరోకు థియేటర్ల వద్ద ఎదురుదెబ్బ తగిలిన సందర్భాలు ఉన్నాయి. దానితో వారు కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు . కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి మన ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు .ఇలా మన తెలుగువారు చేయలేదు అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలైన రామ్ చరణ్ 'రంగస్థలం'  సినిమా లో పూర్తి పల్లెటూరి నేపథ్యమున్న సినిమాలో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప' సినిమాలో కూడా ఇలాంటి డీగ్లామర్ పాత్రలోనే నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: