అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ పైనే అందరి దృష్టి పడింది. ఆమెను తమ సినిమాల్లో యాక్టింగ్ చేయించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ ప్రముఖ హీరోల సరసన నటించేందుకు ఆమె ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. దీంతో సినిమా దర్శక, నిర్మాతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
మెగా హీరోల్లో ఒకరితో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తుందని అప్పట్లో గాసిప్స్ పుట్టుకొచ్చాయి.. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో చరణ్ సరసన నటించేందుకు ఛాన్స్ ఉందని ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ సినిమాని తెరకెక్కించాలని అశ్వనిదత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కుదరలేదు. దీనికి తోడు ఆ సమయంలో అమ్మడు బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.
ఇటీవల మహేష్ నటించే తదుపరి చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుందని ఈ సినిమా తనకు టాలీవుడ్ ప్రవేశ చిత్రం అవుతుందని రకరకాల కథనాలొచ్చాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. చివరకు జాన్వి ప్లేస్ లో పూజా హెగ్డే కన్ఫామ్ అయింది. లేదంటే ప్రిన్స్ తో జాన్వీ స్క్రీన్ షేర్ చేసుకునేదే.
తాజాగా జాన్వి తెలుగు ఎంట్రీ విషయంలో మరో కొత్త హీరో వచ్చాడు. అతనెవరో కాదు బన్నీనే. అల్లు అర్జున్ సరసన జాన్వీ తెలుగు తెరకు పరిచయం అవుతుందని ఒకటే గుసగుస వినిపిస్తోంది. మామ్ శ్రీదేవి అడుగుజాడల్లో తెలుగు సినీపరిశ్రమలో సత్తా చాటాలని జాన్వీ ఉవ్విళ్లూరుతోందిట. అల్లు అర్జున్ నటించనున్న ఐకాన్ లో జాన్వీ నటించే వీలుందంటూ నెటిజన్లు స్టోరీలు అల్లేస్తున్నారు.నిజానికిఈ సినిమాలో ...సారా అలీఖాన్ .. జాన్వీ కపూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే తెలుగులో డెబ్యూ నటిగా పరిచయం కావాలని ఉవ్విళ్లూరుతున్న ఖుషీ కపూర్ పేరును.. లైగర్ బ్యూటీ అనన్య పేరును కూడా అనుకున్నారట. చివరకు బన్నీకి జతకట్టే భామ ఎవరో మరి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి