ఐశ్వర్యరాజేష్. కోలీవుడ్ చిత్రాలతో గుర్తింపునకు నోచుకుని తెలుగు ప్రాజెక్ట్ లతోను ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న హీరోయిన్. గత కొంతకాలంగా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ ఉంది. ఒకవేళ తాను చేసే సినిమా ఎక్స్ పరిమెంట్ కాకపోయినా తనకొచ్చే పాత్రను అలా ఉండేలా చూసుకుంటుంది.
తాజాగా ఈ అమ్మడు కార్తీక్ సుబ్బరాజ్ సమర్పణలో తెరకెక్కుతున్న భూమిక సినిమాతో మరోసారి హైలెట్ కానుంది. రతీంద్రన్ ఆర్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన 'భూమిక' సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు లో కూడా డబ్ చేసి స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేసింది.సినిమాను ఈనెల 23న విడుదల చేయబోతున్నారు.
ఈ టీజర్ చూశాక మరోసారి ఐశ్వర్యరాజేష్ స్టోరీల సెలక్షన్లో సౌత్ లో హాట్ టాపిక్ అయింది. తన పాత్రవరకు ఉన్న ప్రయారిటీ ఏంటీ అనేదానిపై ఓ క్లారిటీ వచ్చాకనే ఐశ్వర్యరాజేష్ డెసిషన్ తీసుకుంటుంది.గతంలో ఇదే విషయంలో సెలెక్టడ్ పాత్రలను ఎంచుకుని గుర్తింపు పొందిన వారిలో మనకు సుహాసిని కనిపిస్తుంది.బహుశ ఆ తర్వాత స్థాయిలో సెలక్షన్ మ్యాటర్ లో ఐశ్వర్యయే ది బెస్ట్ గా ట్రీట్ చేయాలి. మొత్తానికి ఐశ్వర్యరాజేష్ నిర్ణయం ముందు ముందు ఏమైనా మారుతుందేమో చూడాలి. దానికోసమే మేకర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో. ఆమె కెరీర్ ఎలా ఉంటుందో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి