మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు తండ్రి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ప్రేమో మాటల ద్వారా మాత్రమే కాకుండా చేతల ద్వారా కూడా చూపిస్తున్నారు. తండ్రి ని సినిమాల్లోకి రీ ఎంట్రీ చేయిస్తూ సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టి భారీ బడ్జెట్ తో తండ్రి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా నా సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించి తండ్రికి మర్చిపోలేని రీ ఎంట్రీ ని ఇచ్చాడు. అదే విధంగా ఆ తర్వాత చారిత్రాత్మక సినిమా సైరా భారీ లెవెల్లో తెరకెక్కించి రామ్ చరణ్ తండ్రి కి వరుస గిఫ్ట్ లు ఇస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు కూడా మెగా స్టార్ చిరంజీవి విడుదలకు సిద్ధం చేసిన ఆచార్య సినిమా మెగా అభిమానులకు నచ్చే విధంగా వేరే రేంజ్లో తెరకెక్కించాడు మెగా పవర్ స్టార్. ఆ తరువాత చిరంజీవి చేయబోయే గాడ్ ఫాదర్ సినిమా కూడా రామ్ చరణ్ నిర్మిస్తుండటం విశేషం. ఇకపోతే తండ్రి కోసం రామ్ చరణ్ మరొక మహత్తరమైన మన కార్యక్రమానికి శ్రీకారం చుట్ట బోతున్నారట. అదే రాజమౌళి తో సినిమా చేయడం. రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో ఎన్నో కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేసి ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా ఎదగాలని చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కు రాజమౌళి తో మంచి రాపో ఉండడంతో తండ్రితో ఆయన ఓ సినిమా చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. రాజమౌళి తో కెరియర్ మొదట్లోనే మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసి స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్. ఇప్పుడు కూడా ఈ సినిమాతో త్వరలోనే ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తండ్రి కోసం చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా మూడు చిత్రాలు సెట్స్ పైకి వెళ్ళాయి. మూడు సినిమాలు విభిన్నమైన కథలతో తెరకెక్కుతు ఉండగా ఈ చిత్రాలపై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి