టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అదృష్టం ఉంటే ఎవరు ఏ రేంజ్ కి అయినా వెళతారు. ఆ విధంగా ఒక ఫ్లాప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లను రాబడుతుంది టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన పాగల్.  ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం బాగా ఉంది అనే కంటే మంచి సమయంలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకోవడం తో ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి తరలివెళుతున్నారు. ఫలితంగా ఈ సినిమా విశ్వక్ కెరీర్లోనే హైయేస్ట్ వసూలు వసూలు చేసిన సినిమాగా నిలిచింది.

ఈ నగరానికి ఏమైంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ ఫలక్ నుమా దాస్ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మాస్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.  ఆ తర్వాత తన మూడో సినిమా హిట్ అనే క్రైమ్ థ్రిల్లర్ ను చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. దాంతో మినిమమ్ రేంజ్ హీరోగా ఎదిగిన విశ్వక్ ఇటీవలే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకుల్లో పర్వాలేదు అన్న టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి ఏ సినిమా కూడా థియేటర్లో లేకపోవడం ఉన్నా బాగా లేకపోవడం తో ప్రేక్షకులు కూడా థియేటర్లలో సినిమా చూడాలనే ఆకలి మీద ఉండడం అన్ని కలిసి వచ్చి భారీ వసూళ్లను సంపాదించుకుంటుంది.

సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ బాగానే ఎఫెక్ట్ చూపడం స్టార్ట్ అయింది. మొదటి వారంలో భారీ వసూళ్లను సాధించిన పాగల్ రెండవ వారంలో పోటీలో సినిమాలు ఉన్నప్పటికీ కూడా మంచి కలెక్షన్లు సాధిస్తుంది. పది రోజులు పూర్తయ్యే సరికి ఈ సినిమాకి ఐదు కోట్ల రేంజ్ లో షేర్ సొంతం చేసుకొని దుమ్ము లేపుతుంది. ఏదేమైనా పాగల్ సినిమాతో కరెక్ట్ టైంలో వచ్చి విశ్వక్ సేన్ హిట్ కొట్టాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాకి మొత్తంగా అదృష్టం వవరించడంతో బతికి బయటపడింది. కొంచెం కష్టమైనా ఈ సినిమా కరెక్ట్ టైం లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది.  మరి భవిష్యత్తులో ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: